దేశంలో అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. రోడ్డుపై ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు… కొంతమంది దుర్మార్గులు అత్యాచారం చేయడం, కాదంటే హత్యలు చేయడం చేస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు రోజుకొక చోట వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో తాజాగా రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న ఓ అమ్మాయిపై కొందరు దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన దృశ్యాలు సైతం స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలోని ఓ ప్రాంతంలో జ్యోతి, దీపక్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. అయితే జ్యోతి స్థానికంగా ఉండే ఫ్లిప్ కార్ట్ లో కొరియార్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తుండగా, భర్త మరో చోట పని చేస్తున్నాడు. అయితే జ్యోతి రోజూ ఆఫీసుకు వెళ్తూ వస్తుండేది. అయితే జ్యోతి ఎప్పటిలాగే ఆఫీసుకు వెళ్లింది. సోమవారం రాత్రి 7:30 నిమిషాలకు ఆ అమ్మాయి స్కూటీపై ఇంటికి బయలుదేరింది. ఇక పాశిం విహార్ వద్దకు రాగానే అందరూ చూస్తుండగానే ఇద్దరు దండగులు జ్యోతిని తుపాకీతో కాల్చారు. ఈ దాడిలో జ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
దీనిని గమనించిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ దుండగులు ఆ అమ్మాయిని ఎందుకు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.