ఆమెకు అప్పటికే పెళ్లైంది. అయినా సరే భర్తను కాదని ఓ ప్రియుడిని సెట్ చేసుకుంది. అలా ఆ మహిళ కొన్ని రోజుల పాటు ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇంతటితో ఆగకుండా ఆ మహిళ తన బాయ్ ఫ్రెండ్ తో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడడం, వీలైతే ప్రియుడితో కలిసి కోరికలు తీర్చుకోవడం వంటివి చేసింది. కట్ చేస్తే ఆమె ప్రియుడు చివరికి ప్రియురాలికి ఊహించని షాక్ ఇచ్చాడు. తాజాగా ఢిల్లీలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీలోని ఓ ప్రాంతంలో ఓ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. సంతోషంగా సాగుతున్న క్రమంలోనే భార్య తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. ఇంతటితో ఆగకుండా సోషల్ మీడియా ద్వారా ఓ యువకుడిని పరిచయం చేసుకుని అతడితో ప్రేమా, గీమా అంటూ తిరిగింది. ఇక ఇద్దరూ సమయం దొరికినప్పుడల్లా ఫోన్ లు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంతటితో ఆగకుండా ఆ మహిళ తన ప్రియుడితో నగ్నంగా వీడియో కాల్ కూడా మాట్లాడేది. ఇదే సమమయంలో ఆమె ప్రియుడు అదంతా తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసుకునేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రియుడు ఆ వీడియోలను తిరిగి తన ప్రియురాలికి పంపాడు.
ఈ వీడియోలు చూసిన ఆ మహిళ ఒక్కసారిగా షాక్ కు గురైంది. నేను అడిగినంత డబ్బులు ఇవ్వాలని, లేకుంటే నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బ్లాక్ మెయిల్ కు దిగాడు. దీంతో భయపడిపోయిన ఆ మహిళ ఏకంగా రూ.1 లక్ష వరకు అతడికి ముట్టచెప్పినట్లుగా తెలుస్తుంది. ఇక ఇంతటితో ఆగని ఈ కేటుగాడు.. అదే వీడియోలను ఆ మహిళ భర్తకు కూడా పంపాడు. ఆ వీడియోలను చూసి భర్త ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. చివరికి ఆ వీడియోలతో ఆ దుర్మార్గుడు ప్రియురాలి భర్తను కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే నీ భార్య వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఇక తట్టుకోలేకపోయిన ఆ మహిళ భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.