హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్ పోలీస్ కంట్రోల్ రూంలో రాజు సీఐగా విధులు నిర్వర్తించేవాడు. అయితే గురుడు మాంచి రసికుడు. భార్యకి తెలియకుండా వేరే సెటప్ బాక్స్ పెట్టేసాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను వదిలేశాడు. ఈ విషయం తెలిసిన భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఎంతైనా పోలీసోడి భార్య కదా. పోలీసు తెలివితేటల్ని ఉపయోగించి ఎట్టకేలకు భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఫైండ్ మై లొకేషన్ యాప్ ద్వారా.. తన భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో అని నిఘా వేసి ఉంచింది.
ఈ క్రమంలో ఈ నెల 3న జరిగిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ బందోబస్తుకు వెళ్ళాడు సీఐ రాజు. అయితే పోలింగ్ ముగిసినా కూడా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి.. ఫైండ్ మై లొకేషన్ ద్వారా ఎక్కడున్నాడో కనుక్కుంది. ఇంకేముంది గురుడు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ వద్ద ఉన్నట్లు తెలుసుకుంది. అయితే ఎంతసేపటికీ అక్కడ నుంచి కదలకపోవడంతో భర్తపై అనుమానం వచ్చింది. గంట నుంచి ఒకే లొకేషన్ లో ఉన్నట్టు చూపించేసరికి.. పిల్లల్ని వెంటబెట్టుకుని ఆ లొకేషన్ కి వెళ్ళింది. చూస్తే గురుడు.. చెట్ల పొదల్లో కారులో వేరే మహిళతో డ్యాన్స్ కడుతున్నాడు. ఉయ్యాల ఊగుతున్న కారు కిటికీ అద్దం లోంచి బయటకి రా అని ఆమె అనడంతో సీఐకి నోట మాటపడిపోయింది.
భర్తపై గొడవకు దిగడంతో.. భార్యపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. పిల్లలు కేకలు వేయడంతో.. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అరుపులు విని దగ్గరకు వెళ్లారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రాజు.. తాను సీఐ అంటూ కానిస్టేబుళ్లపై దాడికి దిగాడు. దీంతో సీఐ రాజును, అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడి చేసినందుకు ఇద్దరు కానిస్టేబుళ్లు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో రాజుపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ రాజుని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా ఈ రాజుని సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.