హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సౌత్ జోన్ పోలీస్ కంట్రోల్ రూంలో రాజు సీఐగా విధులు నిర్వర్తించేవాడు. అయితే గురుడు మాంచి రసికుడు. భార్యకి తెలియకుండా వేరే సెటప్ బాక్స్ పెట్టేసాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలి మోజులో పడి భార్యను వదిలేశాడు. ఈ విషయం తెలిసిన భార్య.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. ఎంతైనా పోలీసోడి భార్య కదా. పోలీసు తెలివితేటల్ని ఉపయోగించి ఎట్టకేలకు భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. […]
సాధారణంగా సామాన్య ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రచారం చేస్తుంటారు. కొంతమంది ఆకతాయిలు కాల్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. డయల్ 100కి కాల్ చేస్తే.. పోలీసులు తప్పకుండా స్పందిస్తారని ఓ నమ్మకం. హైదరాబాద్ నగరంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్వయంగా డయల్ 100కు ఫోన్ చేశారు. ఎందుకు ఆయన సామాన్యూడిలా కాల్ చేసి.. పోలీసులకు కంప్లేంట్ ఇచ్చారు అనే వివరాల్లోకి […]
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న కేటుగాళ్లను నార్కోటిక్ వింగ్ అరెస్ట్ చేసింది. డ్రగ్స్ విక్రయిస్తున్న 12 మందిని.. డ్రగ్స్ సేవిస్తున్న మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 13 మంది కోసం గాలిస్తున్నారు. ఎన్ఎండీఏ, ఎల్ఏఎస్డీ తో పాటు.. హాష్‌ఆయిల్, గంజాయి సీజ్ చేశారు. ఎస్ఆర్ నగర్, కార్కానా, సికింద్రాబాద్‌లో డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కమిషనర్ సీవీ […]
హైదరాబాద్- మరో నాలుగు రోజుల్లో నూతన సంవత్సరం 2022 లోకి ప్రవేశిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐపీఎస్ అధికారను బదిలీ చేసింది కేసీఆర్ సర్కార్. తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం రాత్రి ప్రభుత్వం జారీ చేసింది. తెలంగాణలో మొత్తం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్లుల్లో పేర్కొంది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గా సీవీ ఆనంద్ ను […]