ప్రభుత్వ పాఠశాలల్లో శిథిలావస్థకు చేరుతున్న భవనాలు, సరైన వనరులు లేకపోవడంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ల వైపు చూసేలా చేస్తున్నాయి. అయితే వాటి ఫీజులను తట్టుకోలేని తల్లిదండ్రులు.. ప్రభుత్వ బడులకే పిల్లలను పంపిస్తున్నారు. ఇవి విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఓ పాఠశాలలో విషాదం నెలకొంది.
ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతున్న విద్యాలయాలు పిల్లల పాలిట శాపంగా మారుతున్నాయి. శిథిలావస్థకు చేరుతున్న భవనాలు, సరైన సదుపాయాలు లేకపోవడంతో అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు స్కూళ్ల వైపు చూసేలా చేస్తున్నాయి. ప్రైవేటు బడుల్లో చదివించే స్తోమత లేక కొంత మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివిస్తున్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య నిర్లక్ష్య ధోరణి పలువురు విద్యార్థులకు ప్రాణాల మీదకు తెచ్చి పెడుతున్నాయి. తాజాగా తెలంగాణలో ఓ ప్రభుత్వ పాఠశాల నిర్వాకం కారణంగా ఓ విద్యార్థిని బలైంది. ఈ ఘటన వికారాబాద్‌లో చోటుచేసుకుంది.
వికారాబాద్ జిల్లా పూడూరు ఓ ప్రభుత్వ పాఠశాలలో దీక్షిత అనే విద్యార్థిని కరెంట్ షాక్ కారణంగా మృత్యువాత పడింది. ఉదయం ఎంతో హుషారుగా పాఠశాలకు వెళ్లిన బాలిక.. మధ్యలో బాత్రూంకి వెళ్లగా.. అక్కడ కరెంట్ షాక్ కొట్టింది. ఈ విద్యుత్ షాక్ తో దీక్షిత అక్కడిక్కడే మృతి చెందింది. ఈ విషయాన్నిచూసిన తోటి విద్యార్థులు.. ఉపాధ్యాయులకు తెలియజేశారు. ఈ విషయాన్ని దీక్షిత తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆడుతూ పాడుతూ అప్పటి వరకు కనిపించిన బాలిక విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. అయితే పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం తన కుమార్తె ప్రాణాలు తీసిందంటూ అక్కడ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనలకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. వారితో మాట్లాడారు.