రోడ్ల మీద, ఒంటరి ఉంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వారు కొందరైతే.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కన్నం వేసే వారు మరికొందరు. అంతేకాకుండా గుళ్లో దేవతా విగ్రహాలను కూడా వదిలిపెట్టడం లేదు.
ఈ మధ్య కాలంలో దొంగతనాలు చాలా ఎక్కువయ్యాయి. బడి, గుడి అని తేడా లేకుండా దోచేస్తున్నారు దొంగలు. రోడ్ల మీద, ఒంటరి ఉంటున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వారు కొందరైతే.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కన్నం వేసే వారు మరికొందరు. అంతేకాకుండా గుళ్లో దేవతా విగ్రహాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఏ మాత్రం భయం లేకుండా, బెరుకు లేకుండా విగ్రహాలకు అలంకరించిన నగలను కొట్టేస్తున్నారు. అయితే వీరి నాలుగు ఆకులు ఎక్కువే చదివిన దొంగలు అనుకుంటా. ఏకంగా దేవుడి నగలను కొట్టేసేందుకు .. దేవుళ్ల పర్మిషన్ తీసుకున్నారు.
దుర్గమ్మ గుడికి ఎవరైనా ఎందుకు పోతారు.. కోరికలు తీరాలని అమ్మవారికి మొక్కుకుంటారు. కానీ ఈ దొంగలు మాత్రం అమ్మవారికే ఎసరు పెట్టారు. దోచుకోవడానికి వచ్చి అమ్మా ఈ దొంగతనం మంచిగా జరగాలే.. ఏమీ అనుకోవద్దమ్మా అంటూ మొక్కి ఆమె నగలను ఎత్తుకుపోయారు. ఈ ఘటన జనగామ జిల్లాలో జరిగింది. బతుకమ్మ కుంట దుర్గమ్మ గుడిలోకి చొరబడ్డారు ఇద్దరు ముసుగు దొంగలు. ముందుగా దుర్గమ్మకు మొక్కి దణ్ణం పెట్టి.. అనంతరం అమ్మవారి మెడలోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. హుండీలోని డబ్బులను నొక్కేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలన్నీ సిసిటీవి ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.