పెద్దల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైన జంటలు.. వివాహేతర సంబంధాలతో కట్టుకున్న వారిని సైతం అంతమొందించడానికి వెనుకాడడం లేదు. వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాల మీదకు తెచ్చింది. భర్తను చనిపోయిన తర్వాత తనకన్నా వయసులో చిన్నవాడితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే ఆమె చేసిన నేరం. తనను కాదన్న అక్కసుతో యువకుడు మహిళపై హత్యాయత్నం చేశాడు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
చిత్తూరు కి చెందిన గంగాధర్ అనే యువకుడికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోజు కూలీగా పనిచేస్తున్న గంగాధర్ కు ఇటీవల చంద్రమ్మ అనే ఓ మహిళ పరిచయం అయ్యింది. ఇద్దరూ ఒకే దగ్గర కూలీ పనులు చేయడం వల్ల తరుచూ తన బైక్ పై ఎక్కించుకొని ఆమెను ఇంటి వద్ద దించి వెళ్లేవాడు. ఇలా వీరి మద్య పరిచయం అక్రమ సంబంధానికి తెరలేపింది. ఇలా ఏడు సంవత్సరాల పాటు ఇద్దరూ గుట్టు చప్పుడు కాకుండా అక్రమసంబంధాన్నికొనసాగించారు. అయితే చంద్రమ్మకు ఇద్దరు ఆడపిల్లలు. వారు పెద్దకావడంతో పరువు పోతుందని చంద్రమ్మ అక్రమసంబంధానికి స్వస్తి చెప్పాలని చూసింది.
ఈ క్రమంలోనే గంగాధర్ కి దూరంగా ఉంటూ వచ్చింది. అతను కూలీకి వెళ్లే చోటికి వెళ్లకుండా వేరే ప్రదేశాలకు వెళ్తూ వచ్చింది. చంద్రమ్మ పై వ్యామోహం తగ్గించుకోలేక గంగాధర్ ఆమెను ప్రతిరోజూ ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు. ఒకరోజు గంగాధర్ ని కలిసిన చంద్రమ్మ తనకు దూరంగా ఉండాలని.. పిల్లల వద్ద పరువు పోతుందని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కానీ గంగాధర్ కి మాత్రం ఆమెపై కోరిక తీరలేదని.. తనతో అక్రమ సంబంధం కొనసాగించాలని బలవంతం చేశాడు.
ఈ క్రమంలో గంగాధర్ శుక్రవారం గంగమ్మ గుడి వద్దకు వెళ్లాడు.. తనతో తెచ్చుకున్న కొడవలితో చంద్రమ్మ పెడపై దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రమ్మపై హత్యాయత్నం చేసిన గంగాధర్ పారిపోయాడు.. కేసు నమోదు చేసుకొని అతని కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.