నేటి కాలంలో పెళ్లైన కొందరు మహిళలు అక్రమ సంబంధాల మోజులో పడి సొంత సంసారాన్ని పక్కకు నెట్టి పరాయి సుఖం కోసం పాకులాడుతున్నారు. దేశమంతట ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇక ప్రియుడి మాయలో పడి అతనితోనే గడిపేందుకు ప్రయత్నిస్తుంటారు. దీనికి ఎవరు అడ్డొచ్చినా అడ్డుతొలగించుకునేందుకు కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు భర్తను కాదని పరాయి వ్యక్తితో లేచిపోయింది. దీనిని సహించలేని భర్త భార్యను అడ్డంగా నరికేశాడు. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని క్రిష్టాపురానికి చెందిన వేలుమురుగన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లి చేయాలని భావించి తల్లిదండ్రులు సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. తమిళనాడులోని జీవానందపురంలో ఉంటున్న తమ దూరపు బంధువైన శంకర్ అనే వ్యక్తికి అరుణ మోలి అనే కూతురు ఉంది. మురుగన్ కు తమ కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని శంకర్ ఆలోచించాడు. దీనికి మురుగన్ తో పాటు అతని తల్లిదండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇరువురి ఇష్ట ప్రకారమే 9 ఏళ్ల కిందట వీరికి ఘనంగా పెళ్లి చేశారు. కోరినంత కట్న కానుకలు ఇచ్చి పెళ్లి అంగరంగా వైభవంగా చేశారు. అయితే పెళ్లైన కొన్నేళ్ల పాటు భార్యాభర్తలు ఇద్దరు ఎంతో సంతోషంగా గడిపారు.
ఎలాంటి గొడవలు లేకుండా జీవితాన్ని ఆనందంగా నెట్టుకొస్తున్నారు. కానీ చాలా ఏళ్లు గడుస్తున్నా.., వీరికి ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో భార్య రోజులు గడిచే కొద్ది పిల్లలు కలగక పోవడానికి భర్తే కారణం అనుకుంది. దీంతో భర్తపై ఇష్టం లేనట్టుగా మెలుగుతూ పరాయి వ్యక్తి కోసం పాకులాడింది. అయితే ఈ క్రమంలోనే అరుణ తన పుట్టింటి వద్ద ఉన్న ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. భర్త లేకపోవడంతో ఎంచక్కా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇక కొన్ని రోజుల తర్వాత భార్య అరుణ తన భర్తకు వద్దకు చేరుకుంది. మనసంతా ప్రియుడి మీదే ఉండడంతో అతనితోనే ఉండాలని భావించింది. దీంతో పుట్టింటికి వెళ్తున్నానని భర్తకు చెప్పిన అరుణ ప్రియుడితో లేచిపోయింది.
ఇక కొన్ని రోజుల తర్వాత తన భార్య ఆచూకి తేదని తెలుసుకున్న భర్త అటు ఇటు అంతా వెతికాడు. ఎంత వెతికినా కూడా భార్య జాడ మాత్రం కనిపించలేదు. ఏం చేయాలో అర్థంకాక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రియుడితో పాటు పారిపోయిందని తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ కు తీసుకొచ్చి భార్యాభర్తల మధ్య సమోద్య కుదిర్చి భార్యను భర్తకు అప్పగించారు. ఇక నుంచి పద్దతిగా మెలగాలని పోలీసులు సర్దిచెప్పడంతో భార్య భర్త వద్దకు వచ్చింది. ఇక ఊహించని ట్విస్ట్ ఏంటంటే? ప్రియుడితో వెళ్లొచ్చిన భార్య అరుణ మూడు నెలల గర్భవతి అని తేలింది. దీంతో భర్త ఒక్కసారిగా కంగుతిన్నాడు. నా వల్ల భార్య గర్భవతి కాలేదని పెద్ద గొడవ చేశాడు. ఇక ఈ క్రమంలోనే భర్త భార్యపై కోపంతో రగిలిపోయాడు. నన్ను కాదని వెళ్లిన భార్యపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల భర్త మురుగన్ భార్య గొంతు కోసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై అత్తింటి వాళ్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చివరికి నిందితుడు మురుగన్ పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇటీవల కుప్పంలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.