నేటి యువత సమస్యలను సవాల్ గా తీసుకోలేకపోతున్నారు. పరిష్కార మార్గాలు అన్వేషించడాం పోయి ప్రాణాలు అర్పిస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే 100 ఏళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఓ నవ వధువు కూడా అలాంటి ఆలోచన చేసి.. భర్తకు, తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చింది. అసలు లేటు వయసులో పెళ్లి. ఆ తరువాత జరగాల్సిన కార్యము జరగకపాయె. ఇక బతకడం ఎందుకనుకుందో ఏమో.. పెళ్ళైన 14 రోజులకే ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన చెన్నైలో చోటుచేసుకోగా.. విచారణలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై, తాండయూర్ సమీపంలోని తమిళనగర్ లో ప్రకాష్, గౌరీ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి రేఖా (35) అనే కుమార్తె ఉంది. ఈమె నగరంలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. రేఖ లావుగా ఉండడం వల్ల ఎన్ని సంబంధాలు వచ్చినా ముందుకు సాగలేదు. ఈ క్రమంలో నగరంలోని త్యాగరాజ్ నగర్ లో నివాసం ఉంటున్న రాజశేఖరన్ (40) అనే వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు. వీరి పెళ్ళికి ఇరు కుటుంబాల అంగీకరించడంతో 14 రోజుల క్రితం వడపళనిలోని మురుగన్ ఆలయంలో కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి చాలా సింపుల్ గా జరింది.
వివాహానంతరం.. దంపతులిద్దరూ భర్త రాజశేఖర్ ఇంటిలో ఉంటున్నారు. ఐదు రోజుల తరువాత రేఖా పుట్టింటికి వెళ్లింది. అప్పటినుంచి ఆమె అక్కడినుంచే ఉద్యోగానికి వెళ్తోంది. ఓ వారం రోజుల తరువాత రాజశేఖర్ ఆమెను ఇంటికి తీసుకురావడానికి.. అత్తారింటికి వస్తున్నట్లుగా కబురు పంపాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి వెళ్లి పెళ్లి కొడుకుని విచారించగా.. విస్తుగొలిపే వాస్తవాలు బయటకొచ్చాయి. ‘వివాహం జరిగిన రోజు ఫస్ట్ నైట్ కు ఏర్పాట్లు చేశారని.. అయితే రేఖ, నిన్ను సుఖపెట్టడానికి నా శరీరం సహకరించడం లేదని తనతో చెప్పిందని భర్త రాజశేఖర్ పోలీసులకు తెలిపాడు. ఇదే విషయంలో రేఖాకు వైద్య పరీక్షలు చేయించడానికి ఇంటికి తీసుకురావాలని తన తండ్రి చెప్పాడని, అలా వచ్చేలోపు తను ఆత్మహత్య చేసుకుందని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.