పంజాబ్ లోని చండీగఢ్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 60 మంది యువతుల ప్రైవేట్ వీడియోలను తీయడంతో పాటు సోషల్ మీడియోలో పోస్ట్ అవ్వడంతో స్థానికంగా ఈ అంశం సంచలనంగా మారింది. విషయం ఏంటంటే? చండీగఢ్ యూనివర్సిటీలో ఎంతో మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇందులో ఓ యువతి మొబైల్ ఫోన్ తో సీక్రెట్ గా ఫ్రెండ్స్, హాస్టల్ యువతులు స్నానాలు చేస్తుండగా దొంగచాటును వీడియోలు తీసింది.
ఇక ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. ఏకంగా అవే వీడియోలను తన ఫ్రెండ్స్ కు షేర్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో సైతం అప్ లోడ్ చేసింది. దీంతో ఆ వీడియోలు కాస్త వైరల్ గా మారడంతో పాటు ఆ యూనివర్సిటీ విద్యార్థులకు తెలిసింది. దీంతో ఒంటికాలుపై లేచిన బాధిత విద్యార్థులు శనివారం అర్థరాత్రి యూనివర్సిటీ ఎదుట నిరసనలకు దిగారు. దీంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే స్పందించిన యూనివర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారాన్ని అందించారు.
Protest breaks out in Chandigarh University after someone secretly recorded videos of girls from hostel bathroom and leaked them online. University administration is trying to muzzle the protest, according to a student : @PunYaab
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) September 17, 2022
వెంటనే హాటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే బాధితులుగా ఉన్న కొందరు అమ్మయిలు మనస్థాపం చెంది ఆత్మహత్యాయాత్నానికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశం పంజాబ్ లో సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ సైతం స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
This girl viral the 60 girls mms in Chandigarh university kindly take strict action on this girl @INCChandigarh @narendramodi @ChandigarhUT #chandigarhuniversity #justiceforcugirls pic.twitter.com/7JVHN0oBNZ
— Shanu XD (@shanu00001) September 17, 2022