అది కృష్ణా జిల్లా గుడివాడలోని మందపాడు. ఇదే గ్రామంలో తాడి మమత అనే మహిళ నివాసం ఉంటుంది. జీవితంలో ఏదో సాధించాలని మమత అనునిత్యం కలలు కంటూ ఉండేది. కానీ తాను ఊహించిన జీవితంలో అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఎన్నో ఆస్పత్రుల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగింది. కానీ రోగం మాత్రం నయమవలేదు. ఎన్నో సమస్యలతో బాధపడుతున్న మమతకు ఎవరు అండగా నిలవలేదు. చివరికి దేవుడి కూడా కనికరించలేదు. ఈ క్రమంలోనే తాను ఊహించిన జీవితం కాదిదంటూ మమత తీవ్ర మనో వేదనకు గురైంది.
చివరికి మేమున్నామంటూ కన్నీళ్లే ఆమెతో స్నేహం చేశాయి. అనారోగ్య సమస్యలు ఆమె వెంట నిడలా నడవడంతో ఏం చేయాలో తెలియని దౌర్భగ్య స్థితిలోకి వెళ్లిపోయింది. సమాజంలో అందరిలా తల ఎత్తుకుని జీవించాలనుకున్న ఆమె ఆశలు అలాగే మిగిలిపోయాయి. ఇక ఇంతటి దారుణమైన జీవితంలో నేను బతకలేనంటూ చివరికి మమత సంచలన నిర్ణయం తీసుకుంది. జీవితంపై విరక్తి చెందిన మమత ఇటీవల గుడివాడలోని పెద్ద కాలువ వద్దకు చేరుకుంది. అనంతరం తన కుటుంబ సభ్యలుకు ఫోన్ చేసి.., అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్ కట్ చేసింది. వెంటనే అలెర్ట్ అయిన మమత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. దీంతో కాలువలో దూకిన మమత కోసం అధికారులు 10 గంటల పాటు శ్రమించారు. ఇక ఎట్టకేలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు స్థానికంగా ఉన్న బాపూజీ నగర్ వద్ద మమత శవాన్ని వెలికి తీశారు. మమత శవాన్ని చూసి ఆమె కుటుంబ సభ్యులు కంట కన్నీరు ఆగలేదు. ఈ ఘటనతో మమత స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలా ఎంతో మంది మహిళలు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ మానసికంగా క్రుంగిపోయి చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సమస్యలతో ఎంతో మంది జీవితంపై విరక్తి చెంది చివరికి బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి మీరిచ్చే సూచనలు ఏంటి? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.