crime news : వాయిలెంట్ పోర్న్ వీడియో షూటింగ్ ఓ పోర్న్ నటి ప్రాణాలు తీసింది. ఆమెతో కలిసి నటిస్తున్న వ్యక్తి ఆమెను దారుణంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఆమె శవాన్ని 15 ముక్కలు చేసి బయటపడేశాడు. పోర్న్ స్టార్ బ్రతికే ఉందని నమ్మించనటానికి చాలా ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్పేయిన్‌లోని బోర్నోకు చెందిన కరోల్ మాల్టేసి (26) భర్తతో విడిపోయి, ఒక్కగానొక్క కొడుకుతో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. ఓ పర్‌ఫ్యూమ్ షాపులో ఆమె పనిచేసేది. కరోనా టైంలో ఉద్యోగం పోయింది. ఈ నేపథ్యంలో కొడుకును చక్కగా చూసుకోవటానికి, కుటుంబాన్ని పోషించటానికి పోర్న్ స్టార్‌గా మారింది. పోర్న్ వీడియోలు తీసి ఓన్లీ ఫ్యాన్స్‌లో ఉంచేది. ఆమె ఇంటి పక్క ఉండే 43 ఏళ్ల డేవిడ్ ఫాంటనా అప్పుడప్పుడు ఆ పోర్న్ వీడియోలలో నటించేవాడు.
జనవరి 10 లేదా 11వ తేదీ ఇద్దరూ ఓ రెండు వీడియోలు చేయటానికి నిశ్చయించుకున్నారు. ఒకటి మామూలు వీడియో.. రెండోది వాయిలెంట్ వీడియో. ఇంట్లొ షూటింగ్ జరుగుతోంది. మామూలు వీడియో అయిపోగానే వాయిలెంట్ వీడియో చేయటం మొదలుపెట్టారు. నగ్నంగా ఉన్న ఆమె మణికట్టు, కాళ్లను పోల్‌కు కట్టేశాడు. ఓ ప్లాస్టిక్ బ్యాగుతో ఆమె ముఖాన్ని కప్పేశాడు. అనుకున్నదాని ప్రకారం సుత్తెతో ఆమెను మెల్లగా కాళ్ల దగ్గరినుంచి కొట్టుకుంటూ రావాలి. అయితే, డేవిడ్ మొదట్లో మెల్లగా కొట్టి తర్వాత గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. అలా తలపై బలంగా సుత్తెతో కొట్టడంతో ఆమె పడిపోయింది. తీవ్రగాయాల పాలైన ఆమె గొంతును కత్తితో కోసి చంపేశాడు. ఇదంతా ఫోన్‌లో రికార్డయింది. తర్వాత శవాన్ని ముక్కలుగా 15 భాగాలు చేశాడు.వాటిని మూటలు కట్టి, కొన్ని రోజులు ఫ్రిజ్‌లో పెట్టాడు. తర్వాత బోర్నోలోని రోడ్డు పక్కన పడేశాడు. మూటల్లో మనిషి శరీరభాగాలను గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, డేవిడ్ ఆమె ముఖాన్ని గుర్తు పట్టలేనంతగా చెక్కేయటంతో ఎవరన్నది పోలీసులు గుర్తించలేకపోయారు. కొద్దిరోజుల తర్వాత కరోల్ పోర్న్ వీడియోలు చూసిన వాళ్లు అది కరోల్‌గా గుర్తించారు. డేవిడ్ మాత్రం కరోల్ బ్రతికే ఉన్నట్లుగా అన్నిటిని మేనేజ్ చేయసాగాడు.
ఫోన్‌లో మెసేజ్‌లు, ఇంటి అద్దె ఇలా అన్నింటిని తన కంట్రోల్‌లోకి తీసుకుని మేనేజ్ చేయసాగాడు. పోలీసులతో కూడా డ్రామాలు ఆడబోయాడు. అయితే అతడిపై అనుమానంతో గట్టిగా విచారించేసరికి నిజం ఒప్పుకున్నాడు. ఆమెను ఎందుకు చంపాడో తనకు కూడా అర్థం కావటం లేదని, ఏదో మైకంలో అలా జరిగిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఫోన్‌లో రికార్డయిన హత్య దృశ్యాలను డిలేట్ చేశానని చెప్పాడు. పోలీసులు ఆ దృశ్యాలను మళ్లీ రికవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: పక్కకొచ్చినా వదల్లేదు.. తొక్కుక్కుంటూ వెళ్లిపోయింది..