Businessman: అత్తింటివారి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఓ బిజినెస్ మ్యాన్ విచిత్రమైన చివరి కోరిక కోరాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని, ఆ వీడియోలో తన చావుకు కారణమైన భార్య కుటుంబం నాశనం అయిన తర్వాతే తన అస్తికలను గంగలో కలపమన్నాడు. జార్ఖండ్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జార్ఖండ్, జమ్‌షెడ్‌పుర్‌కు చెందిన రాహుల్ ఆ ప్రాంతంలో పేరు మోసిన వ్యాపారవేత్త. రాహుల్‌కు సిటీకి చెందిన ప్రముఖ బిల్డర్ ప్రదీప్ చూరివాలా కూతురితో వివాహమైంది. అయితే, గత కొంతకాలం నుంచి అతడిపై అత్తంటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. అత్తా,మామ, భార్య, బావమరిది, కలిసి అతడ్ని వేధించటం మొదలుపెట్టారు. ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. గురువారం సాయంత్రం బిస్తుపూర్‌లోని ఓ హోటల్‌కు వచ్చాడు. అక్కడ తన చావుకు అత్తింటివారే కారణమని, ఆ కుటుంబం మొత్తం నాశనం అయిన తర్వాతే తన అస్తికలను హరిద్వార్‌లో కలపాలని కోరాడు.
అంతవరకు అస్తికలను బ్యాంక్ లాకర్‌లో భద్రపరచాలని సూచించాడు. తనకు భార్య, పిల్లలంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నాడు. తన భార్య చెడ్డది కాదని, ఆమె తల్లి చెడ్డదానిలా మార్చిందని పేర్కొన్నాడు. మామ ప్రదీప్ డబ్బు కోసం ఏదైనా చేస్తాడని, కూతుర్ని బాగా డబున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడని తెలిపాడు. ఈ కారణంతోనే తనను టార్చర్ చేస్తున్నాడని వెల్లడించాడు. సెల్ఫీ వీడియోను తమ్ముడికి పంపిన తర్వాత హోటల్‌లోని ఏడవ అంతస్తునుంచి కిందకు దూకాడు. శరీరం నేలకు బలంగా తాకటంతో అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pakistan: పరువు హత్య: సోదరి చేసే పని నచ్చక తుపాకితో కాల్చిన అన్న
Rahul Agarwal from Rourkela ended life blaming his in-laws & a false #498A by his wife. He says he couldn’t see his old parents suffer & running around courts, couldn’t bear alienation from his twin kids. He jumped to his death leaving long suicide video @arunbothra @KirenRijiju pic.twitter.com/YyoJe5w0fh
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) May 6, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.