Chintamani: ఆ అమ్మాయి ఓ చదువుల సరస్వతి.. టెన్త్‌లో టాపర్, ఇంటర్‌లోనూ టాపర్.. ఎన్నో ఆశలతో బీఎస్సీ అగ్రికల్చర్‌లో చేరింది. ప్రతి సంవత్సరం మెరిట్‌తో పాసవుతూ వచ్చింది. ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరదామని అనుకుంది. కానీ, ఆమె తలరాత మరోలా ఉంది. ఓ యువకుడి రూపంలో కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని తట్టుకోలేక ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. యువకుడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. చదువులో ఎంతో ప్రతిభ కనబరిచిన ఆ మెరిట్ విద్యార్థిని ఆర్థాంతరంగా ప్రాణాలు తీసుకుంది.
ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిక్‌బళ్లాపూర్ జిల్లా బన్నికుప్పే గ్రామానికి చెందిన పవిత్ర అనే 21 ఏళ్ల యువతి మెరిట్ స్టూడెంట్. చింతామణిలోని కురుబుర్ గ్రామంలో ఉన్న అగ్రికల్చర్ కాలేజ్‌లో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. అక్కడే హాస్టల్‌లో ఉండి కాలేజ్‌కు వెళుతోంది. అయితే, పవిత్ర గత కొద్దిరోజుల నుంచి మూడీగా ఉంటోంది.
తోటి విద్యార్థులతో, హాస్టల్‌లోని రూమ్ మేట్స్‌తో కూడా ముందులా మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలోనే గురువారం అర్థరాత్రి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో ఓ సూసైడ్ నోట్‌ను గుర్తించారు. అందులో ‘టార్చర్’ అన్న పదం రాసి ఉంది. దానితో పాటు ఓ ఫోన్ నెంబర్ కూడా ఉంది.
పోలీసులు పవిత్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్ వేధింపుల కారణంగానే పవిత్ర ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ప్రియుడి దారుణ హత్య.. లైవ్ వీడియో తీసిన మహిళ.. అసలు ట్విస్ట్ ఏంటేంటే!