కాయకష్టం చేసి కడుపు కట్టుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తల్లిదండ్రులు. చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ కష్టాలను తీరుస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే కుమారులు కూడా మంచి ఉద్యోగాలు సాధించారు. దీంతో మా కష్టాలు తీరుతాయని భావించిన ఆ తల్లిదండ్రులకు అనుకోని సంఘటన ఎదురైంది. అసలేం జరిగింది.. ఇప్పుడు తెలుసుకుందాం..
కాయకష్టం చేసి కడుపు కట్టుకొని తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు ఆ తల్లిదండ్రులు. చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ కష్టాలను తీరుస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలకు తగ్గట్టుగానే కుమారులు కూడా మంచి ఉద్యోగాలు సాధించారు. దీంతో మా కష్టాలు తీరుతాయని భావించిన ఆ తల్లిదండ్రులకు అనుకోని సంఘటన ఎదురైంది. అసలేం జరిగింది.. ఇప్పుడు తెలుసుకుందాం..
ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించి తమ జీవితాల్లో వెలగులు నింపుతారనుకున్న తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. విధులు నిర్వహించాడానికి బయలుదేరిన ఇద్దరు కొడుకులకు అలా జరగడంతో వారు తట్టుకోలేకపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్, శారద దంపతులకు ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమారులను చదివించారు. వీరిలో పెద్దవాడైన ఇప్పలపల్లి శివరామకృష్ణ ఈ మధ్యనే భారత రైల్వేశాఖలో టిసి గా ఉద్యోగం పొంది సికింద్రాబాద్ లోని మౌలాలిలో ట్రైనింగ్ పొందుతున్నడు. చిన్న కుమారుడు ఇప్పలపల్లి హరికృష్ణ బిసిఎస్ పూర్తి చేసి ఘట్ కేసర్ లోని ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించాడు. కొడుకులిద్దరికి మంచి ఉద్యోగాలు రావడంతో వారి తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.
అయితే చిన్నకొడుకు నాలుగురోజుల కింద ఇంటికి వచ్చాడు. పెద్దకుమారుడు ఆదివారం రోజు ఇంటకి చేరుకున్నడు. కాగా పెద్ద కుమారునికి తపాలా శాఖలో కూడా ఉద్యోగం రాగా ఏ ఉద్యోగం చేయాలనే విషయంపై చర్చించుకున్నారు. ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య ఆనందంగా గడిపిన ఇద్దరు అన్నదమ్ములు తిరిగి విధులకు వెళ్లేందుకు పయనమయ్యారు. సోమవారం తెల్లవారుజామున 4:30 గంటలకు బైక్ పై బయలుదేరారు. హసన్ పర్తి మండలం అనంతసాగర్ శివారుకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఒకటి వెనుక నుంచి మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో వీరి బైక్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు శివరామకృష్ణ, హరికృష్ణ ఎగిరి రోడ్డు పక్కన పడ్డారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలతో పాటు తలకు బలమైన గాయాలు కావటంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి పోలీస్ వారికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎల్కతుర్తి సిఐ ప్రవీణ్ కుమార్ , ఎస్సై పరమేశ్, హసన్ పర్తి ఎస్సై దేశిని విజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఉద్యోగాలు సాధించిన కొడుకులిద్దరు ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. అన్మదమ్ముల మృతితొ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు పోలీసులు.