చూడటానికి పొట్టిగా ఉన్నారు. మరుగుజ్జు వ్యక్తులు కదా అని తక్కువ అంచనా అస్సలు వేయకండి. వీరు చేసిన సాహసం వింటే ముక్కున వేలేసుకుని ఔరా అంటారు. అవును.. మీరు చదివింది ముమ్మాటికి నిజమే. వీరి చేసింది చూసి పోలీసులే బిత్తరపోయి హ్యాట్సాప్ అంటున్నారు. అసలు వీళ్లు అంతలా చేసిన సాహసం ఏంటోననే కదా మీ ప్రశ్న? అయితే ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. కండ బలం కన్న, గుండె బలం ఎంతో గొప్పదని పెద్దలు అంటుంటారు. అలా వారికి కండబలం లేకున్నా గుండె బలంతో అందరూ ఆశ్చర్యపోయే సాహసాన్ని చేసి చూపంచి అందరితో శభాష్ అనిపించుకున్నారు.
బీహార్ బక్సార్ జిల్లాలోని నువాన్ గ్రామంలో రంజిత్ పశ్వాన్, సునైనా అనే మరుగుజ్జు దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే ఇటీవల ఓ రోజు అర్థరాత్రి వీరు నిద్రిస్తుండగా వీరి ఇంట్లోకి ఓ దొంగ ప్రవేశించారు. మెల్లగా ఇంట్లో ఉన్న అల్మారీ తెరిచి అన్ని సర్దుతున్నాడు. దీంతో ఏదో జరుగుతున్నట్లు ఈ దంపతులు గ్రహించారు. వెంటనే వచ్చి చూడగా ఓ దొంగ అల్మారీ తెరిచి చూస్తున్నాడు. వెంటనే అలెర్ట్ అయిన ఈ మరుగుజ్జు దంపతులు ఎలాగైన ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాలని అనుకున్నారు.
ఇది కూడా చదవండి: Tirupati: భార్యపై కోపం.. కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి!
ఇందులో భాగంగానే కండబలం కన్న, గుండె బలం ఎంతో గొప్పదనే విధంగా అతనిని వెనకాల నుంచి గట్టిగా పట్టుకున్నారు. వీళ్ల చెర నుంచి పారిపోయేందుకు ఆ దొంగ ఎన్నో రకాల ఎత్తుగడలు వేశాడు. అయినా బెదరకుండా ఈ దంపతులిద్దరూ అతడిని పట్టుకుని తాడుతో కట్టేశారు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకుని ఈ మరుగుజ్జ దంపతుల ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పారు. ఇక వీరి చేసిన సాహసానికి స్థానికులు సైతం శభాష్ అంటున్నారు. ఈ మరుగుజ్జు దంపతుల సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.