ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రాజ్ కుమార్. చూడటానికి అమాయకంగా కనిపిస్తున్నా.. ఇతడు చేసిన పని మాత్రం అత్యంత దారుణం. అయితే ఇటీవల ఈ కిరాతకుడు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. రాగానే ఇంకా వంట లేయలేదా అని భార్యపై కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే భార్యపై కోపంతో ఈ దుర్మార్గుడు దారుణానికి పాల్పడ్డాడు. కన్న కూతురుని చంపి ఊరి చివరన పాతిపెట్టాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బీహార్ లోని సరౌని గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కు పెళ్లై నాలుగేళ్ల కూతురు కూడా ఉంది. రాజ్ కుమార్ పెళ్లైన కొన్నాళ్ల పాటు బుద్దిగా తన పని తాను చేసుకుంటూ సంసారాన్ని ఈడ్చుకుంటూ వచ్చాడు. ఇదిలా ఉంటే రాజ్ కుమార్ గత కొన్ని రోజుల నుంచి తాగుడుకు బానిసయ్యాడు. రోజూ మద్యం తాగి ఇంటికి రావడం, ఆ తర్వాత భార్యతో గొడవ పడడం. గత కొంత కాలంగా ఇదే ఇతని దిన చర్యగా మారిపోయింది. ఇకపోతే రాజ్ కుమార్ ఇటీవల మద్యం తాగి ఇంటికి వచ్చాడు. వస్తు వస్తూనే వంట చేయలేదా అంటూ భార్యతో గొడవకు దిగాడు.
ఇంతటితో ఆగక భార్యపై దాడి కూడా చేయబోయాడు. దీంతో భయంతో భార్య వెంటనే పక్కింట్లోకి పరుగులు తీసింది. ఆ సమయంలో అతని నాలుగేళ్ల కూతురు అక్కడే ఉంది. పట్టరాని కోపంతో ఊగిపోయిన ఈ కిరాతకుడు ఇంట్లో ఉన్న పదునైన ఆయుధంతో కూతురు నరికి చంపాడు. ఆ తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని ఊరి చివర ఉన్న నది ఒడ్డున పాతిపెట్టాడు. ఇక ఉన్నట్టుండి కూతురు కనిపించకపోవడంతో రాజ్ కుమార్ భార్య అంతటా వెతికింది.
కానీ, కూతురు ఆచూకి మాత్రం దొరకలేదు. ఆ తర్వాత భర్త రాజ్ కుమార్.. కూతురుని చంపి నదిఒడ్డున పాతిపెట్టానని తెలిపాడు. భర్త మాటలు విన్న భార్య ఒక్కసారిగా షాక్ కు గురై కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అనంతరం ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని వెలికి తీసి తండ్రిని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వంట చేయలేదన్న భార్యపై కోపాన్ని కూతురిపై తీర్చుకున్న ఈ కిరాతక తండ్రి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.