ఆమెకు చాలా ఏళ్ల కిందటే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి భర్తతో బాగానే గడిపింది. ఇకపోతే ఈ దంపతులు గత కొంత కాలం నుంచి హైదరాబాద్ లో ఉంటున్నారు. ఇంటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆ మహిళ.. చివరికి ఓ లాడ్జిలో శవమై కనిపించింది. అసలేం జరిగిందంటే?
అది ఏప్రిల్ 14 మధ్యాహ్నం. కడుపులో నొప్పిగా ఉందని, సొంత ఊరిలో చూపించుకుంటానని భర్తకి చెప్పి వెళ్లి హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలు దేరింది. ఇక ప్లాన్ ప్రకారమే ఆ మహిళ తన మేనల్లుడిలో కలిసి లాడ్జికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఇద్దరు కలిసి రెండు రోజుల పాటు లాడ్జిలో గడిపారు. కట్ చేస్తే అదే లాడ్జిలో ఆ మహిళ ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. లాడ్జిలో ఆ మహిళ నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రకరిస్తున్నారా? అసలేం జరిగిందంటే?
ఖమ్మం జిల్లా తిరువూరు గ్రామానికి చెందిన కృష్ణారావు-అరుణ (35) దంపతులు హైదరాబాద్ లోనే ఉంటూ కోళ్లఫారంలో పని చేస్తున్నారు. చాలా కాలం పాటు ఇక్కడే పని చేస్తూ సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ 14న అరుణ.. కడుపులో నొప్పగా ఉందని, తిరువూరుకి వెళ్లి చూపించుకుంటానంటూ భర్తకు చెప్పి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి.. మేనల్లుడైన ఆంజనేయులితో కలిసి భద్రాచలం పట్టణానికి వెళ్లింది. ఇద్దరూ కలిసి అక్కడే ఉన్న ఓ లాడ్జిలో దిగారు. రెండు రోజులపాటు అత్తా, అల్లుడు అందులోనే గడిపారు. కట్ చేస్తే.. ఆదివారం సాయంత్రం అరుణ లాడ్జిలోని రూమ్ లో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.
ఈ సీన్ చూసిన లాడ్జి నిర్వాహకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. అల్లుడితో గడిపింది అందరికీ తెలిస్తే పరువుపోతుందనే ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని లాడ్జి నిర్వాహకులు తెలిపారు. అనంతరం పోలీసులు అరుణ మృతదేహాన్ని పోస్ట్ మార్టం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆంజనేయులే అరుణను హత్య చేశాడని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని అరుణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.