వారిది అందమైన కాపురం. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పటి వరకు వారి సంసారం ఎంతో సంతోషంగా సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే భర్త పరాయి మహిళపై మోజు పడ్డాడు. ఇంట్లో భార్య ఉన్నా కూడా వివాహేతర సంబంధాలకు అలవాటు పడి చివరికి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. భర్త కనికరం అన్న మాటే మరిచి కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ కు చెందిన నరేందర్ సింగ్, చందాపురోహిత్ (35) భార్యాభర్తలు బెంగుళూరులో నివాసం ఉంటున్నారు.
వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫిగా సాగుతూ ఉండేది. కానీ రోజులు మారే కొద్ది భర్త వక్రమార్గంలోకి వెళ్తూ పరాయి మహిళపై మోజుపడ్డాడు. సమయం దొరికినప్పుడల్లా నరేందర్ సింగ్ ప్రియురాలితో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసేవాడు. చివరికి ఇదే విషయం భార్యకు తెలిసింది. ఇదేం పనంటూ భార్య భర్తను నిలదీసే ప్రయత్నం చేసింది. కానీ భర్త నరేందర్ సింగ్ మాత్రం భార్యను తుపాకీతో బెదిరిస్తూ ఉండేవాడు. ఇక ఇంతటితో ఆగకుండా తన ప్రియురాలితో ఎక్కడి కంటే అక్కడికి తిరిగేవాడు.
ఇవన్నీ తట్టుకోలేని భార్య చందాపురోహిత్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు భార్యాభర్తలిద్దరినీ స్టేషన్ కు పిలిపించి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. అయినా భర్త నరేందర్ సింగ్ బుద్ది మాత్రం మారలేదు. దీంతో భర్త మారడని గ్రహించిన భార్య చందాపురోహిత్ తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక చేసేదేం లేక చందాపురోహిత్ ఇటీవల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న చందాపురోహిత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. చివరికి ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.