బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడి ఓ భార్య కట్టుకున్న భర్తను కసితీరా హత్య చేసింది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగింది? భర్తను హత్య చేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు తెలియాలంటే మీరు తప్పకుండా ఈ స్టోరీని చదవాల్సిందే. అది బెంగుళూరులోని సోలదేవనహల్లి ప్రాంతం. ఇక్కడే దాసేగౌడ (50), జయ (35) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 16 ఏళ్ల కిందట వివాహం జరిగింది.
పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఇక పిల్లలు కూడా పెద్దవారై బాగా చదువుకుంటున్నారు. అలా వీరి కాపురం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే భార్య జయ తన బుద్దిని వక్రమార్గంలోకి నెట్టేసింది. ఇంతటితో ఆగకుండా స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఇక సమయం దొరికితే చాలు.., భార్య ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తూ ఉండేది. అయితే ఈ క్రమంలోనే భార్య ఊహించని నిర్ణయం తీసుకుంది.
విషయం ఏంటంటే? భార్య జయ ప్రియుడుని తమ్ముడంటూ భర్త దాసేగౌడకు పరిచయం చేసింది. దీంతో నిజమేనని భావించిన భర్త కొన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉండిపోయాడు. ఇక ఇదే మంచి సమయం అనుకున్న భార్య.. భర్త లేని టైమ్ చూసి.. ప్రియుడితో బెడ్ రూంలో తెగ రొమాన్స్ చేసేది. అయితే భార్య ఇటీవల ప్రియుడితో ఇంట్లో బెడ్రూంలో ఉండగా భర్త చూశాడు.ఈ సీన్ ను చూసిన భర్తకు దిమ్మతిరిగింది. ఇదే బుద్ది అంటూ భర్త భార్యపై దాడికి దిగాడు. ఇక నుంచి ఇలాంటి పనులు మానుకోవాలని, లేకుంటే నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో భయంతో వణికిపోయిన భార్య.. ఇలా అయితే కాదని భావించి భర్తను హత్య చేయాలని ప్లాన్ వేసింది.
ఇక ఇందులో భాగంగానే భార్య ప్రియుడితో కలిసి ఇటీవల భర్తను దారుణంగా హత్య చేసింది. అనంతరం భర్త శవాన్ని కారులో తీసుకెళ్లి 50 అడుగులు లోతులో ఉన్న ఓ డ్రైనేజీలో పడేసింది. ఇదే కాకుండా భర్త వస్తువులు ఏవీ కూడా కనిపించకుండా అక్కడక్కడ పడేసింది. అలా కొన్ని రోజుల తర్వాత దాసేగౌడ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొదటగా భార్యను విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భర్తను హత్య చేసింది భార్య అని తేలడంతో దాసేగౌడ కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. అనంతరం పోలీసులు భార్య జయను, ఆమె ప్రియుడును అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.