22 ఏళ్లు గణేష్ స్థానికంగా ఉండే ఓ భర్త లేని మహిళపై మోజు పడ్డాడు. ఆ మహిళ కూడా అతనికి దగ్గరైంది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. కానీ, నమ్మిన ప్రియుడే చివరికి ఆ మహిళను నట్టేట్ట ముంచి దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
ఇతడి పేరు గణేష్. వయసు 22 ఏళ్లు. స్థానికంగా పని చేస్తూ జులాయిగా తిరుగుతుండేవాడు. ఈ క్రమంలోనే మనోడు భర్తలేని మహిళపై కన్నేశాడు. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని అనుకున్నాడు. చివరికి తాను అనుకున్నట్టే చేసి ఆమెతో బాగానే ఎంజాయ్ చేశాడు. ఆమె కూడా అతనితో కలిసి తిరిగింది. అలా కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆ మహిళ తన పిల్లలను చూసుకుంటూ ప్రియుడితో గడిపేది. కానీ, నమ్మిన ఆ మహిళను గణేష్ నట్టేట్ట ముంచి చివరికి ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని బసవేశ్వర్ పరిధిలోని జేసీ నగర్ ప్రాంతం. ఇక్కడే శరవణం- శివ కుమార్ దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి ఇద్దరు పిల్లలు జన్మించారు. కొంత కాలం తర్వాత భర్త శివ కుమార్ మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ తన పిల్లలను చూసుకుంటూ ఉండేది. ఈ క్రమంలోనే ఆ వివాహితకు గణేష్ (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఇద్దరూ కొన్నాళ్ల నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. దీంతో ఆ మహిళ తన ప్రియుడిని ఎంత గానో నమ్మి అతడికి దగ్గరైంది. అయితే ఆ మహిళ ప్రియుడు గణేష్ కు రూ.50 ఇచ్చి ఇల్లు కూడా కట్టించింది.
కానీ, గణేష్ మాత్రం తన ప్రియురాలు చాలదన్నట్టుగా.. స్థానికంగా ఉండే ఎంతో మంది మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ.. ఇలాంటి పనులు వద్దని, నవ్వు బుద్దిగా ఉండాలంటూ ఎన్నో సార్లు వేడుకుంది. ఆమె మాటలు వినని గణేష్.. పరాయి అమ్మాయిలు, మహిళలో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. తట్టుకోలేక పోయిన శరవణం.. చనిపోతున్నట్లు నటించి తన ప్రియుడి బద్ది మార్చాలని అనుకుంది. తాను అనుకున్నట్లుగానే ఇటీవల ఇంట్లో నువ్వు పరాయి మహిళలతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తే.. ఉరి వేసుకుని చనిపోతా అంటూ గొంతుకు తాడు బిగించుకుంది.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇక కోపంతో ఊగిపోయిన ప్రియుడు గణేష్.. అదే ఫ్యానుకు ఆ మహిళకు ఉరి వేసి హత్య చేశాడు. శరవణం చనిపోయిందని తెలుసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. శరవణ మరణంతో ఆమె ఇద్దరు తల్లిదండ్రులు లేని అనాధలయ్యారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.