ఢిల్లీలో చోటు చేసుకున్న శ్రద్ధా వాకర్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరువక ముందే ఇలాంటి మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతితో సహజీవనం చేస్తున్న ఓ యువకుడు మరో యువతిని ప్రేమ ఉచ్చులోకి దించాడు. ఐదు రోజుల పరిచయంలోనే ఆమెను ఇంటికి తీసుకువచ్చి హత్య చేశాడు. అనంతరం శవాన్ని మూడు ముక్కలుగా చేసి బయట పడేశాడు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బంగ్లాదేశ్‌లోని గోబర్‌చకాకు చెందిన అబు బకర్ తన ప్రియురాలు స్వప్నతో కలిసి రాజు అనే వ్యక్తి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే, స్వప్నను తన భార్యగా అతడు అందరికీ పరిచయం చేశాడు.
వీరిద్దరూ భార్యాభర్తలుగానే అక్కడి వారందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే అబు బకర్‌కు కవిత అనే యువతితో పరిచయం అయింది. సరిగ్గా ఐదు రోజుల తర్వాత ఆమెను తన అద్దె ఇంటికి తీసుకెళ్లాడు. ఆ టైంలో అతడి ప్రియురాలైన స్వప్న నర్స్ డ్యూటీకి వెళ్లింది. ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఏదో విషయంలో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఒకరి నొకరు తిట్టుకున్నారు. కవిత గట్టిగా అరుస్తూ మాట్లాడసాగింది. దీంతో అబుబకర్ తన సహనాన్ని కోల్పోయాడు. రాక్షసుడిలా మారి ఆమె గొంతును పట్టుకున్నాడు. కవిత గొంతును బలంగా నులిమి చంపేశాడు. ఆమె చనిపోయిందని తెలిసిన తర్వాత శవాన్ని అక్కడినుంచి బయట పడేయటానికి ఆలోచనలు మొదలుపెట్టాడు. శవాన్ని నేరుగా తీసుకుపోతే పొరుగింటి వాళ్లకు అనుమానం వస్తుందని భావించాడు.
మటన్ కొట్టే కత్తిని ఒకదాన్ని కొనుక్కుని ఇంటికి వచ్చాడు. ఆ కత్తితో కవిత మృతదేహాన్ని మూడు ముక్కలుగా ఖండించాడు. అనంతరం తల, కాళ్లు, చేతుల్ని పాలిథిన్ కవర్లో పెట్టి బయట పడేశాడు. మిగిలిన భాగాల్ని ఓ బాక్స్‌లో కుక్కాడు. ఆ బాక్సును ఇంట్లోనే పెట్టాడు. అదే రోజు రాత్రి స్వప్నతో కలిసి ఢాకాకు బయలు దేరాడు. కవిత కనిపించకుండా పోవటంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కవితను చివరి సారిగా అబు బకర్‌తో కలిసి ఉండటం చూసినట్లు కొంతమంది చెప్పారు. దీంతో పోలీసులు ఢాకా వెళుతున్న అబు బకర్‌ను వెతికిపట్టుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు కవిత శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
Abu Bakar Siddiqui cut the body of his Hindu lover Kavita Rani into three pieces and cut off her head and both hands wrapped in plastic polythene and threw it into the drain. The incident took place in Khulna, Bangladesh. pic.twitter.com/Y129SnB4dp
— Voice Of Bangladeshi Hindus 🇧🇩 (@VoiceOfHindu71) November 16, 2022