తప్పు చేశాడు అని తెలియడంతో.. కాబోయే భర్తని అరెస్ట్ చేసి లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్న జున్మోని రభా మృతి చెందింది. ఆ వివరాలు..
అస్సాం లేడీ సింగంగా పేరుతెచ్చుకున్న అస్సాం మహిళా సబ్ ఇన్పెక్టర్ జున్మోని రభా గుర్తుందా.. తప్పు చేసిన వాడు కాబోయే భర్త అని తెలిసినా కూడా.. అతడిని అరెస్ట్ చేసి తన నిజాయతీతో.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన తర్వాత ఆమె లేడీ సింగంగా పేరు తెచ్చుకుంది. ఇలా ఉండగా.. మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో జున్మోని మృతి చెందారు. ప్రైవేట్ పని మీద ఆమె కారును ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జున్మోనిని ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందారు.
ప్రస్తుతం జున్మోని మోరికొలాంగ్ పోలీస్ స్టేషన్ ఔట్ పోస్టు ఇంఛార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తోన్నారు. వ్యక్తిగత పనిపై కారులో వెళ్తున్న ఆమె వాహనాన్ని.. ఓ ట్రక్కు బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందారు. కలియాబోర్ సబ్ డివిజన్, జఖలబంధ పోలీస్ స్టేషన్ పరిధిలోని సరుభుగియా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. తీవ్ర గాయాలతో ఉన్న జున్మోనిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. అయితే జున్మోనిది హత్యా లేక యాక్సిడెంటా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మొరికోలాంగ్ స్టేషన్ ఇంచార్జ్‌గా ఉన్న జున్మోని నేరస్తుల పట్ల కఠినంగా ఉండేవాళ్లు. అయితే ఓసారి ఆమె లంచం తీసుకుంటూ పట్టుబడి సస్పెషన్ కూడా ఎదుర్కున్నారు. సస్పెన్షన్ గడువు ముగిసాక విధుల్లో చేరిన జున్మోని.. చట్ట విరుద్దంగా అమర్చిన మెషిన్లతో కంట్రీ బోట్లను నడుపుతున్న కొంతమంది బోటర్లను అరెస్ట్ చేశారు. అంతేకాక ఓ బీజేపీ ఎమ్మెల్యేతో ఆమె సంభాషణ కూడా వైరల్‌గా మారింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.