అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా కోపంతో ఊగిపోయిన అత్త కోడలి తలనరికింది. అనంతరం కోడలి తలతో పోలీసుల ఎదుట లొంగిపోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం రామాపురం గ్రామానికి చెందిన అత్త సుబ్బమ్మ, కోడలు వసుంధర మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా అత్తకోడలి మధ్య మరోసారి గొడవ రాజుకుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు.
ఇక కోపంతో ఊగిపోయిన సుబ్బమ్మ కోడలి తల నరికింది. ఈ దాడిలో కోడలు వసుంధర తల మొండెం వేరుచేసి కోడలి తలతో స్టేషన్ కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. స్టేషన్ కు వెళ్తుండగా ఈ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్త సుబ్బమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ గొడవల కారణంగా ఈ దారుణం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా క్షణికావేశంలో అత్త కోడలి తల నరికిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.