కర్మ సిద్దాంతంలో భాగంగా చేసిన తప్పులకు ప్రతిఫలంగా ఎప్పటికైన శిక్ష అనుభవించక తప్పదని అందరూ అంటుంటారు. కానీ ఓ ఘటనలో మాత్రం ఓ వ్యక్తి చేసిన తప్పుకి శిక్ష అప్పుడే పడింది. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ షాకింగ్ తో పాటు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికా కాలిఫోర్నియాలోని ట్రెంటన్ టౌన్ లో 60 ఏళ్ల జోసెఫ్ మెకనాన్, ప్యాట్రిషియా డెంట్ అనే ఇద్దరు ప్రేమికులు. చాలా కాలంగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి.
దీంతో ఏం జరిగిందో ఏమో కానీ ప్రియురాలిని ప్రియుడు గొంతుపిసికి హత్య చేశాడు. ఇక అనంతరం ఆమె శవాన్ని తాను నివాసం ఉంటున్న ఇంటి వెనకాల గుంత తీసి పూడ్చి పెట్టే ప్రయత్నం చేశాడు. ఇలా పూడ్చి పెట్టే క్రమంలోనే ప్రియుడికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ప్రియురాలి బొందపైనే కుప్పకూలిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: భర్త ఇంట్లో బాత్ రూం లేదని కొత్త పెళ్లికూతురు ఆత్మహత్య!
ఇక పోలీసులు ముందుగా జోసెఫ్ ది అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారిస్తుండగా తను పడి ఉన్న స్థలంలో గుంత తీసి ఉండడం పోలీసులు గమనించారు. ఏంటా అని పోలీసులు గుంత తొవ్వి చూస్తే కవర్ లో చుట్టిన ఓ శవం కనిపించింది. కానీ విచారణలో మాత్రం ఆ శవం జోసెఫ్ ప్రియురాలిదని తేలింది. దీంతో ఇద్దరికి పోస్ట్ మార్టం నిర్వహించగా ప్రియురాలిది హత్య, ప్రియుడిది గుండెపోటుతో సహజ మరణం అని రిపోర్టులో వెల్లడయ్యాయి. ఇటీవల అమెరికాలో చోటు చేసుకున్నఈ ఘటన తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.