Ameerpet Metro: కొంతమంది పురుషులు మానసిక లోపమో లేక కామమో తెలీదు కానీ, సైకోలుగా మారుతున్నారు. మహిళలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అవకాశం దొరికితే రెచ్చిపోతున్నారు. తాజాగా, ఓ యువకుడు మెట్రో స్టేషన్‌లోని లిఫ్ట్‌ను స్థావరంగా చేసుకుని అరాచకాలకు పాల్పడ్డాడు. లిఫ్ట్ ఎక్కిన మహిళల ముందు బట్టలు విప్పి నీచంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖైరతాబాద్‌కు చెందిన ఓ యువతి అమీర్ పేటలో షాపింగ్‌కు వచ్చింది. షాపింగ్ ముగిసిన తర్వాత ఖైరతాబాద్ వెళ్లటానికి అమీర్‌పేట మెట్రో స్టేషన్ దగ్గరకు వచ్చింది. మెట్రో స్టేషన్ లిఫ్ట్ ఎక్కింది.
రాజు అనే యువకుడు అమె వెంటే లిఫ్ట్‌లోకి ఎక్కాడు. ఆ వెంటనే తన దుస్తులు విప్పి హస్త ప్రయోగం చేసుకోవటం మొదలుపెట్టాడు. ఈ చర్యతో ఆమె షాక్ తింది. ఏం జరుగుతోందో అర్థం కాక బిక్కచచ్చిపోయింది. లిఫ్ట్ ఆగిన వెంటనే బయటకు పరిగెత్తింది. మెట్రో స్టేషన్ సిబ్బందికి విషయం చెప్పింది. వాళ్లు రాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒడిశాకు చెందిన రాజు ప్రతీ రోజు ఇలా లిఫ్ట్‌లోకి ఎక్కి ఒంటరి మహిళలతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Langer House: గర్ల్ ఫ్రెండ్ కి హాయ్ చెప్పాడని.. కత్తులతో పొడుచుకున్న10th క్లాస్ స్టూడెంట్స్!