దీపావళి పండగ సందర్భంగా ఆహ్మదాబాద్ లోని కొందరు యువత రెచ్చిపోయి ప్రవర్తించారు. నడి రోడ్డుపై కార్లపై తిరుగుతూ టపాసులు పేల్చుతూ నానా హంగామా సృష్టించారు. వీరు చేసిన హంగామను కొందరు వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోలు తిరిగి తిరిగి చివరికి పోలీసుల చెంతకు చేరాయి. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు రోడ్డుపై హంగామా సృష్టించిన యువతను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే రోడ్డుపై హంగమా సృష్టించిన ఈ కేటుగాళ్లకు పోలీసులు ఊహించని శిక్ష వేశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. దీపావళి పండగను దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరు జరుపుకున్నారు. అయితే ఈ పండగ సందర్భంగా ఆహ్మదాబాద్ లోని కొందరు యువకులు నడి రోడ్డుపై రెచ్చిపోయి ప్రవర్తించారు. కార్లపై కూర్చుని టపాసులు పేల్చుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇక వీరు చేస్తున్న హంగామను కొందరు వాహనదారులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియోలు వైరల్ గా మారి చివరికి పోలీసుల వరకు వెళ్లాయి. వెంటనే స్పందించిన పోలీసులు రోడ్డుపై హంగామా సృష్టించిన యువకులను పట్టుకున్నారు.
ఇక అనంతరం ఆ కేటుగాళ్లతో పోలీసులు అందరు చూస్తుండగా అదే రోడ్డుపై గుంజీలు తీయించారు. వారు గుంజీలు తీస్తుండగా పోలీసులు వీడియో తీసి ఆహ్మదాబాద్ పోలీస్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతోంది. ఒకపక్క దేశంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం రోజు రోజుకు తీవ్ర తరమవుతుంటే.., కొందరు మాత్రం పండగల పేరుతో వాయు కాలుష్యాన్ని మరింత సృష్టిస్తున్నారు. ఇలా వాయు కాలుష్యాన్ని సృష్టించడంతో పాటు వాహనదారులకు ఇబ్బందులు కలిగించిన ఈ కేటుగాళ్లకు సరైన గుణపాఠం చెప్పారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
#AhmedabadPolice pic.twitter.com/ddwZCFd9Gf
— Ahmedabad Police 👮♀️અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 27, 2022