ఆ యువతి పేరు శ్వేత. వయసు 19 ఏళ్లు. చదువుకునే వయసులో తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పెళ్లి చేశారు. దీంతో అప్పటి నుంచి శ్వేత భర్తతో సంసారం చేసిందా అంటే అదీ లేదు. చదువు పేరుతో షికారులు తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసేది. ఈ క్రమంలోనే ప్రేమా, గీమా అంటూ ఓ యువకుడితో సినిమాలు, షికారులకు తిరిగేది. ఇక చివరికి ఆమెకు భర్తతో కంటే ప్రియుడితోనే ఉండాలనిపించింది. దీంతో అడ్డుగా ఉన్న భర్తను ప్రాణాలతో లేకుండా చేసి ఎంచక్కా ప్రియుడితో ఉండాలని చూసింది. దీని కోసం భార్య ప్రియుడితో కలిసి దారుణానికి పాల్పడింది. ఇటీవల బెంగుళూరులో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టపర్తి జిల్లా హిందూపురం ప్రాంతం. ఇక్కడే చంద్రశేఖర్ (35), శ్వేత (19) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. చంద్రశేఖర్ కన్న శ్వేత 16 ఏళ్లు చిన్నది. అయితే పెళ్లైన తర్వాత కూడా శ్వేత చదువుకునేందుక భర్త ఓకే అన్నాడు. దీంతో శ్వేత హిందూపురంలో చదువుకుంటున్న క్రమంలో శ్వేతకు సురేష్ (22) అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం రాను రాను ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరు పికల్లోతు ప్రేమించుకున్నారు. ఇక శ్వేత కాలేజీ పేరుతో ఎక్కడెక్కడికో తిరుగుతుందని భర్త అనుమానించేవాడు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు చెలరేగాయి. అలా కొన్నాళ్ల తర్వాత భార్య ప్రేమాయణం భర్త చంద్రశేఖర్ కు తెలిసింది.
దీంతో భర్త చంద్రశేఖర్ భార్య శ్వేతను మందలించాడు. ఈ విషయం శ్వేత తల్లిదండ్రులకు కూడా తెలియడంతో మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని ఈ దంపతులను బెంగుళూరులోని యలహంకలో ఉండమని చెప్పారు. దీంతో ఈ జంట హిందూపురం నుంచి యలహంకకు పయనమయ్యారు. అక్కడే ఈ దంపతులకు కొన్ని రోజులు సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ శ్వేతకు మాత్రం.. భర్త కంటే ప్రియుడితో ఉండాలనే ఇష్టం. భర్త అడ్డుగా ఉండడంతో శ్వేతకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ క్రమంలోనే శ్వేతకు ఓ దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అదే భర్తను ప్రాణాలతో లేకుండా చేయడం. ఇదే విషయం తన ప్రియుడు సురేష్ కు చెప్పింది. ప్రియురాలి మాటను కాదనని ప్రియుడు సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హత్యలో భాగంగానే ప్రియుడు సురేష్ ఈ నెల 22న బెంగుళూరు వచ్చాడు.
ఇక ప్రియురాలు శ్వేత ప్రియుడు సురేష్ కు ఫోన్ చేసి.. నా భర్త ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు వచ్చెయ్ అంటూ సమాచారం ఇచ్చింది. ఇక సురేష్ శ్వేత ఇంటికి వచ్చి.. నీతో మాట్లాడాలంటూ చంద్రశేఖర్ ను మేడపైకి తీసుకెళ్లాడు. ఎవరో అని తెలియక చంద్రశేఖర్ మేడపైకి వెళ్లాడు. దీంతో పైకి వెళ్లగానే సురేష్ చంద్రశేఖర్ తో గొడవ పడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇదే సమయం అనుకున్న సురేష్ చంద్రశేఖర్ పై ఇటుకతో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం చంద్రశేఖర్ చనిపోయాడని తెలుసుకున్న సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు.
వెంటనే ఈ హత్య విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చంద్రశేఖర్ మృతదేహాన్ని పరిశీలించారు. ఇక అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా భార్య శ్వేతను పోలీసులు విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు శ్వేతను గట్టిగా విచారించడంతో భార్య అసలు విషయం బయటపెట్టింది. నా ప్రియుడు సురేష్ తో కలిసి నా భర్తను నేనే హత్య చేశానని తెలపడంతో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు అంతా షాక్ అయ్యారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు శ్వేత, సురేష్ లను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.