ఈ రోజుల్లో ప్రేమ పేరుతో చాలా మంది యువకులు దారుణాలకు తెగబడుతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడడం, కాదంటే హత్యలకు కూడా వెనకాడడం లేదు. సరిగ్గా ఇలాగే రెచ్చిపోయిన ఓ వన్ సైడర్ వేధింపులకు ఓ ఇంటర్ యువతి ప్రాణాలు తీసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఆ దుర్మార్గుడు యువతిని ఎలా వేధించాడనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది రాజన్న సిరిసిల్ల జిల్ల బోయినపల్లి మండలం తడగొండ గ్రామం. ఇక్కడే రాజు, స్వప్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి త్రిష (18) అనే కూతరు ఉంది. ఈ అమ్మాయి ప్రస్తుతం స్థానికంగా ఇంటర్ చదువుతోంది. అయితే ఇదే గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు గత 6 నెలలుగా త్రిషను ప్రేమించాలని వెంటపడ్డాడు. దీనికి త్రిష అంగీకరించలేదు. ఇదే విషయమై యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో అతనికి వార్నింగ్ ఇచ్చారు. ఇక అయినా వదలని ఆ వన్ సైడ్ లవర్ రెచ్చిపోయి యువతిని అనేక రకాల వేధింపులకు గురి చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా త్రిష ఇంట్లో ఒంటరిగా ఉన్నది చూసి సతీష్ ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ప్రేమించాలని మరోసారి అడిగాడు. దీనికి యువతి మళ్లీ నిరాకరించింది.
దీంతో కోపంతో ఊగిపోయిన సతీష్.. నన్ను ప్రేమిస్తావా? లేదంటే చస్తావా అంటూ బలవంతంగా పురుగుల మందు యువతి చేతికిచ్చాడు. ఇక అతని టార్చర్ ను భరించలేకపోయిన త్రిష అదే పురుగుల మందు అతడి ముందే తాగింది. యువతి తాగిందని తెలుసుకున్న ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన స్థానికులు త్రిష తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే తల్లిదండ్రులు త్రిషను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో అప్పటికే ఆ యువతి ప్రాణాలు విడిచింది. కూతురు మరణించడంతో త్రిష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారిలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. నన్ను ప్రేమించకపోతే చచ్చిపో అని వేధించిన ఈ వన్ సైడ్ లవర్ టార్చర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.