ఓ యువకుడు పట్టపగలు ఏకంగా బ్యాంకులో దొంగతనం చేశాడు. అధికారుల కళ్లుగప్పి అక్కడున్న డబ్బును తీసుకుని పరారయ్యాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
బ్యాంకులో పట్టపగలు దొంగలు పడడం మనం ఎక్కువగా సినిమాల్లో చూసి ఉంటాం. ఇలాంటి సీన్ లు నిజ జీవితంలో చాలా తక్కువే అని చెప్పాలి. కానీ, ఉత్తర్ ప్రదేశ్ లో అదే జరిగింది. అవును.. మీరు విన్నది నిజమే. పట్టపగలు అందరూ చూస్తుండగానే బ్యాంకు అధికారుల కళ్ల ముందే డబ్బులు దొచుకున్నాడో దొంగ. ఈ దృశ్యాలన్నీ బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. దీంతో వెంటనే స్పందించిన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర్ ప్రదేశ్ బులంద్ షహర్ పరిధిలోని గులావతి ప్రాంతం. ఇక్కడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఉంది. అయితే ఇటీవల ఉదయం బ్యాంకు ఖాతాదారులతో పాటు అధికారులతో బ్యంకు అంతా అల్లరిగా మారిపోయింది. ఓ దొంగ ఇదే మంచి సమయం అనుకున్నాడు. బ్యాంకు అధికారులు సైతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. దీంతో ఆ దొంగ.. సరాసరి ఏకంగా క్యాబిన్ లోకే వెళ్లాడు. అక్కడే ఉన్న అధికారుల కళ్లు గప్పి కొంత డబ్బు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదంతా బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
— Hardin (@hardintessa143) May 25, 2023