ఒక వ్యక్తికి తన శరీరంలో సరిపడ రక్తం లేకపోయినా రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల రక్తం వర్గాన్ని బట్టి వైద్యులు రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు. కానీ ఒడిశాలో మాత్రం ఆసుపత్రి సిబ్బంది దీనికి విరుద్దంగా నడుచుకోవటంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సుందర్ గఢ్ జిల్లాలో కుత్రా బ్లాక్ లోని బుదకటకు చెందిన సరోజిని కాకు అనే మహిళ కొన్ని రోజుల నుంచి రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంది. అయితే ఈ క్రమంలో రక్త మార్పిడి కోసమని ఆ మహిళ స్థానికంగా ఉండే రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఇక ఆ మహిళ సమస్యను గ్రహించిన వైద్యులు ఆ మహిళకు O+ కు బదులు B+ బ్లడ్ ఎక్కించారట. దీంతో కొద్దిసేపు బాగానే ఉన్న ఆ మహిళ సడెన్ మరణించింది. ఇక O+ కు బదులు B+ బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కించారని బంధువులు గ్రహించటంతో బోరున విలపించారు.
ఇక దీనిపై ఆగ్రహాంతో ఊగిపోయిన సరోజిని బంధువులు ఆసుపత్రికి నిర్లక్ష్యం వల్లే చనిపోయిందంటూ ఆరోపించారు. కాగా బంధువుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆమె చనిపోలేదంటూ వైద్యులు తెలిపారు. ఇక ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందంటూ మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.