మాములుగా మన ఇంట్లో కానీ మరెక్కడైన శుభకార్యం జరిపే ముందు దేవుడిపై నమ్మకంతో కొబ్బరి కాయలు కొట్టడం, దీపం వెలుగించటం, లేదంటే మొక్కటం చేస్తుంటాం. కానీ ఓ దొంగ మాత్రం ఏకంగా దేవుడి గుడిలో దొంగతనం చేస్తూ అదే గుడిలో ఆ దొంగ చేసిన పనికి అందరూ కడుపుబ్బ నవ్వుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని 4వ డివిజన్‌లో స్థానికంగా అంకమ్మ దేవాలయం ఉంది.
అయితే ఈ గుడిలో దేవుడికి చాలా మంది భక్తులు పూజలు చేస్తూ హుండిలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. తాజాగా స్థానికంగా ఉండే వ్యక్తి అదే గుడిలో అర్థరాత్రి దొంగతనానికి పతకం రచించాడు. అనుకున్నట్లుగా ముందుగా గుడి తాళం పగలగొట్టి గుడిలోకి వెళ్లాడు. ఆ తర్వాత మెల్లగా హుండిలో నగదును అంతా తీసుకుంటున్న క్రమంలో దేవుడికి రెండు చేతులు జోడించి మొక్కటం మొదలు పెట్టాడు. ఈ దృశ్యాలు ఆ గుడిలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
ఇక అనుమానం వచ్చిన ఆ దేవస్థానం కమిటీ అధ్యక్షుడు కొమ్ము భాస్కర్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఆ దొంగతనం చేసిన వ్యక్తి మొక్కిన దృశ్యాలు యూట్యూబ్ లో పోస్ట్ చేయటంతో చూసిన ప్రతీ ఒక్కరు నవ్వటం మొదలు పెట్టారు. ఈ దొంగ మాములోడు కాదురోయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.