మైబైల్ వల్ల ఒక్కోసారి ఘర్షణ గొడవలు అన్ని ఇన్ని కావు. చిన్న గొడవల నుంచి ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్లాయి. గత కొన్ని రోజుల క్రితం తనకు ఫోన్ ఇవ్వలేదని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు తాజా ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. మొబైల్ ఫోన్ ఇవ్వలేదని ఓ యువకుడు తన సొంత అన్ననే హత్య చేశాడు. అత్యంత క్రూరంగా ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లోనే పాతిపెట్టాడు ఘనుడు. 22 రోజుల తరువాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో విషయం బయటపడింది.
యూపీ – సహరాన్పూర్, థానా గంగోహ్ పరిధిలోని ఫతేపూర్ ధోలా గ్రామంలో ఇద్దరు సోదరులు ఫర్మాన్, రెహమాన్ ఉన్నారు. జులై 18వ తేదీన ఈద్ కి మూడు రోజుల ముందు ఫర్మాన్ కొత్త ఫోన్ కొన్నాడు. రెహమాన్ కూడా తనకు ఫోన్ కావాలని డిమాండ్ చేశాడు. అతను ఫోన్ ఇవ్వనన్నాడు. ఇద్దరికి గొడవ జరగడంతో రెహమాన్ తన అన్న ఫర్మాన్ తలపై కర్రతో బలంగా కొట్టాడు. అన్నయ్య చనిపోయాడు. దీంతో తమ్ముడు రెహమాన్ భయపడి అన్న శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆపై ఇంట్లోనే గొయ్యి తవ్వి ఖననం చేశాడు.
ఎవరికి అనుమానం రాకుండా అక్కడే గ్రామంలో తిరిగాడు. అన్న ఎక్కడ అని అడిగితే పనికి వెళ్లాడు అని చెప్పాడు. కాని ఇంటి నుంచి దుర్గంధం రావడంతో గ్రామస్తులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. పోలీసులు తమ దైన రీతిలో రెహమాన్‌ను విచారించారు. అప్పుడు రెహమాన్ అసలు విషయం బయట పెట్టాడు. తన సోదరుడిని హత్య చేసినట్లు అంగీకరించాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కొంతకాలం క్రితం చనిపోయారు. అక్కచెల్లెల్లకు వివాహాలు కూడా చేశారు. వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. కాని సెల్ ఫోన్ కోసం ఇంతలా చంపేశాడు.