వారంతా వివిధ నేరాల్లో పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో మార్పు తెచ్చి.. చెడు మార్గాన్ని వదిలేసి.. నూతన జీవితం ప్రారంభించేలా కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు.. వారిని ఓ ఆశ్రమంలో ఉంచారు. అయితే పాత జీవితమే ముద్దనుకున్న ఆ మహిళలు పోలీసులే బిత్తరపోయేలా ప్లాన్ చేసి.. పారిపోయారు. ఆ వివరాలు.. నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరు నేరాల్లో పట్టుబడిన యువతులు, మహిళలను కోర్టు ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ లోని కస్తూర్బా గాంధీ ఆశ్రమంలో ఉంచారు. గత 4 నెలలుగా ఇక్కడే ఉంచి వారిలో మార్పు తేవాలని, సమాజంలో గౌరవంగా బతికేలా చేయడం కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి : స్నేహితుడి భార్యపై కన్నేశాడు! ఆమె కూడా.. ఏకంగా బెడ్ పైనే!
వీరందరిని పూర్తి భద్రత మధ్య ట్రస్టులోని ఓ హాలులో మొత్తం 18 మందిని ఉంచారు. అయితే, రెండు రోజుల క్రితం తెల్లవారుజామున 2 గంటల సమయంలో 14 మంది మహిళలు తప్పించుకొని పారిపోయారు. మొత్తంగా 15 మంది మహిళలు తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా.. ఓ యువతికి గాయాలు కావడంతో ఆమె అక్కడే ఉండిపోయిందని తెలుస్తోంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ 14 మంది మహిళలు పక్కా ప్లాన్ వేసి ఆశ్రమంలోని బాత్‌రూం వెంటిలేటర్ విరగ్గొట్టి, ప్రహరీ గోడను సైతం దూకి పారిపోయారు.
ఈ సంఘటను చూస్తుంటే వీరిలా పారిపోవడానికి ముందే పథకాన్ని రచించుకున్నట్లుగా తెలుస్తోంది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందికి పడుకున్నట్లుగా కనిపించడం కోసం.. దుప్పట్లను వరుస క్రమంలో పెట్టి పైనుంచి దుప్పటి కప్పడం వల్ల మనిషి పడుకున్నట్లుగానే సీన్ క్రియేట్ చేశారు. ఉదయం వీరు లేకపోవడంతో సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఈ సంఘటన బయటపడింది. ఈ విషయాన్ని గుర్తించిన మేనేజర్ రామకృష్ణ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో ఎక్కువగా మహారాష్ట్ర, బెంగాల్‌కు చెందిన మహిళలు ఉన్నారు.
ఇది కూడా చదవండి : భర్తని గుడికి పంపి.. ప్రియుడికి ఫోన్ చేసింది! కానీ..!
ప్రస్తుతం వీరి కోసం పోలీసులు.. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లుగా వెల్లడించారు. అయితే, ఇనుప గ్రిల్స్‌ను ఎలా కత్తిరించారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కట్ చేసేందుకు ఏయే వస్తువులను వాడారు.. అవి వారికి ఎక్కడి నుంచి లభించాయన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వీరు ఎలా ఇక్కడినుంచి తప్పించుకున్నారన్న విషయం ఈ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.