సమాజంలోని కొన్ని పరిస్థితులు ఎటు పోతున్నాయో తలుచుకుంటేనే భయంగా మారుతోంది. నేటి పురుషుల లోకం మహిళల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఇటీవల సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘటన ఇందుకు సాక్షంగా నిలుస్తోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..రాజునాయక్ తండాకు చెందిన శంకర్ నాయక్ అనే వ్యక్తి జూన్ 13 న హత్యకు గురై మరణించాడు. ఇక ఆ వ్యక్తి మరణానికి కారణంగా భావించి ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఇక జైల్లో ఉన్న ఆ మహిళ ఇటీవల కాలంలో బెయిల్ పై విడుదలైంది. దీనితో శంకర్ నాయక్ కుటుంబ సభ్యులు ఆ మహిళపై పగతో పట్టుకున్నారు. ఇక తండాలోకి తీసుకొచ్చిన వెంటనే అ మహిళను చిత్రహింసలకు గురిచేశారు దారుణంగా అవమానించారు.
శంకర్ నాయక్ కుటుంబ సభ్యులైన 10 మంది వ్యక్తులు ఆ మహిళను నగ్నంగా ఊరంతా తిప్పారు. ఇంతటితో ఆగకుండా కళ్లల్లో కారం చల్లి, వివస్త్రను చేసి కర్రలతో ఆ మహిళను ఘోరాతి ఘోరంగా చితకబాది అవమానించారు. దీంతో స్థానిక గ్రామ పెద్దలు కొందరు రంగంలోకి దిగి ఆ మహిళకు బాసటగా నిలిచారు. ఇక వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ 10 మందిపై కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ఆ మహిళపై 10 మంది వ్యక్తులు మానవ సమాజం సిగ్గుపడేలా వ్యవరించిన తీరుపై మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.