ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలనుకుంటున్నారా? పెట్రోల్ బండితో వేగలేకపోతున్నారా? అయితే ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనేందుకు ఇదే మీకు సరైన సమయం. సమాజం కోసం ఆలోచించి.. పర్యావరణాన్ని పాడు చేయకూడదని కొంచెం కష్టమైనా గుండెని రాయి చేసుకుని ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలనుకుంటున్నాం. కంపెనీ వాళ్ళు కాస్త దయుంచి ధర తగ్గిస్తే బాగుణ్ణు. డిస్కౌంట్ ఏమైనా ఇస్తే బాగుణ్ణు.. అని అనుకుంటున్నారా? అయితే ఈ ఆఫర్ మీ కోసమే. రిపబ్లిక్ డే సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తమ కస్టమర్ల కోసం భారీ తగ్గింపు ఆఫర్ ను తీసుకొచ్చింది. ఓలా ఎస్1 ప్రో వేరియంట్ మీద రూ. 25 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఓలా ఎస్1 స్టాండర్డ్, ఓలా ఎస్1 ప్రో, ఓలా ఎస్1 ఎయిర్ వేరియంట్లలో వస్తుంది. ఓలా ఎస్1 ప్రో మోడల్ పై రూ. 10 వేల వరకూ తగ్గింపుతో వస్తుంది. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రూ. 10 వేల డిస్కౌంట్ తో వస్తుండగా.. ఏపీ, తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో రూ. 7 వేల తగ్గింపుతో వస్తుంది. ఇక ఓలా ఎస్1 ప్రో ఖాకీ మోడల్ పై రూ. 15 వేల వరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ ను రిపబ్లిక్ డే సందర్భంగా తీసుకొచ్చారు. ఇది కేవలం జనవరి 26 నుంచి 29 వరకూ మాత్రమే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక మీ దగ్గర పాత ద్విచక్ర వాహనం పెట్రోల్ దైనా లేదా ఎలక్ట్రిక్ వాహనమైనా ఎక్స్ ఛేంజ్ చేస్తే.. రూ. 10 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
ఇక ఓలా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనమని ఎవరినైనా రిఫర్ చేస్తే రూ. 1500 వరకూ క్యాష్ బ్యాక్ వస్తుంది. ముగ్గురికి రిఫర్ చేస్తే రూ. 4500 వరకూ క్యాష్ బ్యాక్ బెనిఫిట్ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా.. ఈఎంఐలో కొంటే గనుక 5% గ్యారంటీ ఇన్స్టాంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఓలా ఎస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేస్తే.. 5 శాతం డిస్కౌంట్ అంటే గరిష్టంగా రూ. 5 వేల తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం జనవరి 31 వరకూ మాత్రమే వర్తిస్తుంది. వాయిదా కాలం 3, 6, 9, 12, 18, 24 నెలల వరకూ పెట్టుకునే సదుపాయం ఉంది. ఇక ఓలా ఎస్1 ప్రో టాప్ స్పీడ్ గంటకు 95 కి.మీ. కాగా.. 3.8 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగం అందుకుంటుంది.
ఇక రేంజ్ విషయానికి వస్తే.. ఏఆర్ఏఐ సర్టిఫైడ్ రేంజ్ 141 కి.మీ. కాగా ఓలా ట్రూ రేంజ్ 128 కి.మీ.గా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 128 కి.మీ. ప్రయాణిస్తుంది. ఓలా ఎస్1 ప్రో ప్రారంభ ధర రూ. 1,39,999 కాగా.. ఓలా ఎస్1 ప్రారంభ ధర రూ. 1,09,999 గా ఉంది. ఇక ఓలా ఎస్1 ఎయిర్ ప్రారంభ ధర రూ. 84,999 గా ఉంది. ఓలా ఎస్1 ప్రో ఖాకీ మోడల్ ని కొనాలనుకుంటే రూ. 15 వేల వరకూ తగ్గింపు వస్తుంది. ఇదే వాహనాన్ని మీ పాత వాహనంతో ఎక్స్ ఛేంజ్ లో కొంటే రూ. 10 వేల వరకూ తగ్గింపు ఉంటుంది కాబట్టి రూ. 25 వేల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అదే ఓలా ఎస్1 ప్రో కొనాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 వేల తగ్గింపు లభిస్తుంది.
ఇదే వాహనాన్ని మీ పాత వాహనం ఎక్స్ ఛేంజ్ చేసి కొంటే గనుక మరో రూ. 10 వేల వరకూ తగ్గింపు వస్తుంది. అంటే ఓలా ఎస్1 ప్రో మీద రూ. 17 వేల డిస్కౌంట్ వస్తుంది. ఇవి మాత్రమే కాకుండా రిఫర్ చేసినందుకు క్యాష్ బ్యాక్ కింద రూ. 4500 కూడా వస్తుంది. మరి మీరు ఈ ఓలా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? మీ ఇంటి చుట్టుపక్కల గానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో గానీ ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలి అని అనుకునేవాళ్లు ఉంటే గనుక ఈ విషయాన్ని వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వాళ్లకి పైసలు ఖర్చు తగ్గించండి. అలానే ఓలా అందిస్తున్న ఈ భారీ డిస్కౌంట్లపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.