కేంద్ర ప్రభుత్వం 2023-2024 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023-24 సంవత్సరానికి గాను 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అమృత్ కాల్ బడ్జెట్ పేరిట రానున్న పాతికేళ్లలో దేశాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సప్తర్షి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. సమ్మిళితాభివృద్ధి, ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, హరిత వృద్ధి, యువశక్తి, ఆర్థిక రంగం.. ఇలా వృద్ధిని ఏడు విభాగాలుగా విభజించి ఆమేరకు బ్లూప్రింట్ ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరి బడ్జెట్‌లోని కీలకాంశాలు ఏవి.. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు.. ఏ రంగాలకు ఎంత కేటాయింపులు జరిపారు వంటి పూర్తి వివరాలు మీ కోసం..
బడ్జెట్‌లో వేతన జీవులకు గుడ్ న్యూస్ చెప్పారు నిర్మలా సీతారామన్. ఏడాదికి రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అన్నారు. గతంలో రూ.5లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు కొత్త విధానంలో దాన్ని రూ.7 లక్షలకు పెంచారు. ఏడు లక్షలు, ఆపై అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉంటే.. వారికిరూ.3 లక్షల నుంచే పన్ను మదింపు మొదలవుతుంది. రూ.3-6 లక్షల వరకు 5 శాతం, రూ.6-9 లక్షల వరకు 10 శాతం, రూ.9-12 లక్షల వరకు 15 శాతం, రూ.12-15 లక్షల వరకు 20 శాతం,రూ.15 లక్షలు మించితే 30 శాతం పన్ను రేట్లు వర్తిస్తాయి.
బడ్జెట్‌లో భాగంగా మధ్య తరగతి వారికే కాక.. అధికాదాయ వర్గాలకు కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారు చెల్లించాల్సిన సర్ చార్జీలను తగ్గించింది. ఇప్పుడు రెండు పన్ను విధానాల్లో ఏటా రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఆదాయం ఉన్నవారికి 10 శాతం, రూ.కోటి నుంచి రూ.2 కోట్లు ఆదాయం ఉన్నవారికి 15 శాతం, రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయం ఉన్న వారికి 25 శాతం, రూ.5 కోట్లకు పైగా ఆదాయం ఉన్న వారి వద్ద నుంచి 37 శాతం సర్‌ఛార్జ్ వసూలు చేస్తున్నారు. అయితే కొత్త విధానంలో రూ.2 కోట్లకు పైగా ఆదాయ వర్గాలకు అత్యధిక సర్‌ఛార్జ్ 25 శాతమే అమలు చేస్తామని ప్రకటించారు. తాజా నిర్ణయంతో అధికాదాయం ఉన్న వారు.. గతంలోని 42.74 శాతానికి బదులు 25 శాతం సర్ ఛార్జీ చెల్లిస్తే చాలు అని తెలిపింది కేంద్రం.
బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ.. రైతులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు నిర్మలా సీతారామన్. వ్యవసయా రుణ మంజురు లక్ష్యాన్ని 20 లక్షల కోట్లకు పెంచింది. కిసాన్ సమృద్ధి యోజననే కాక.. ఈ సంవత్సరం అనేక ఇతర పథకాలను ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రైతుల కోసం అభ్యుదయ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాక 6300 అగ్రి సొసైటీలను కంప్యూటరీకరిస్తామని తెలిపింది.
చిరుధాన్యాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. శ్రీఅన్న యోజనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లోని మిల్లెట్ ఇన్‌స్టిట్యూట్‌ని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ప్రకటించారు. అంతేకాక త్వరలోనే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్‌ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలానే సాగు రంగంలో స్టార్టప్‌లకు తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు.
కరోనా తర్వాత బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరిగాయి. గత ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశారు. 89,155 కోట్ల రూపాయలు కేటాయించారు. అలానే 2047 నాటికి సికెల్ సెల్ అనిమియాను పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి, కాలేజీల్లో మరిన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో రైల్వేలకు అత్యధిక కేటాయింపులు చేపట్టారు. ఏకంగా రూ.2.4 లక్షల కోట్లు కేటాయించారు. దీనిలో ట్రాక్‌లను పునరుద్ధరించడం కోసం 17,296 కోట్ల రూపాయలకు పైగా కేటాయించారు.
ఈ సారి బడ్జెట్‌లో రక్షణకు శాఖకు కేటాయించింది తక్కువే. అయితే గత ఏడాదితో పోలిస్తే.. 13 శాతం పెంచారు. ఈ సారి రక్షణ రంగానికి 5.94 లక్షల కోట్లు కేటాయించారు. దీనిలో 1.62 లక్షల కోట్లను కొత్త ఆయుధాలు, ఎయిర్‌క్రాఫ్ట్, యుద్ధ నౌకలను కొనుగోలు చేయడానికి వినియోగించనున్నారు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్ట డిపాజిట్ పరిమితిని 15 నుంచి 30 లక్షల రూపాయలకు పెంచారు. మహిళల కోసం రెండళ్ల పాటు అందుబాటులో ఉండేలా సింగిల్ సేవింగ్ స్కీమ్ మహిళా సమ్మాన్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించారు. దీనిలో గరిష్టంగా 2 లక్షల వరకు పొదుపు చేయవచ్చు. ఈ మొత్తం మీద 7.5శాతం వడ్డీ లభిస్తుంది.
ఈ బడ్జెట్‌లో ఎంఎస్‌ఎంఈలకు చేయూతనిచ్చేందుకుగాను రుణ హామీ పథకాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది కేంద్రం. ఇందుకోసం బడ్జెట్‌లో 9,000 కోట్ల రూపాయలు కేటాయించింది. 2023, ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.
కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి సొంత ఊళ్లకు వచ్చిన వారిని మహత్మా గాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకుంది. అలాంటి ప్రతిష్టాత్మక పథకానికి 2023-24 బడ్జెట్ కేటాయింపులోల కేంద్రం భారీగా కోత పెట్టింది. ఈ ఏడాది కేవలం 60 వేల కోట్లను మాత్రమే ఈ పథకానికి కేటాయించింది.
సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకు వారికి 2023-24 బడ్జెట్ సందర్భంగా కేంద్రం తీపి కబురు చెప్పింది. పీఎం ఆవాస్ యోజన పథకానికి ఈ సారి భారీగా నిధులు పెంచింది. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సారి ఏకంగా 66 శాతం నిధులను పెంచి.. 79 వేల కోట్ల రూపాయలను పీఎం ఆవాస్ యోజన పథకానికి కేటాయించింది.
కేంద్రం మొదటిసారి బడ్జెట్‌లో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్ పేరుతో ఓ ప్యాకేజీకి తీసుకురాబోతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సంప్రదాయ, హస్తకళాకారులను ఉద్దేశించి ఈ ప్యాకేజీ తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
2070 నాటికి కర్భన ఉద్గారాలు లేని ఇంధన వ్యవస్థను సృష్టించాలన్న లక్ష్యంతో గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్ర 2023-24 బడ్జెట్‌లో 19,700 కోట్లు, ఇంధన రూపాంతీకరణ కార్యక్రమానికి 35 వేల కోట్ల రూపాయలు, లద్ధాఖ్ నుంచి 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని గ్రిడ్‌తో అనుసంధానించే సరఫరా వ్యవస్థ నిర్మాణానికి రూ.20 వేల కోట్లు కేటాయించింది.
విద్యుత్ రంగానికి రూ. 35 వేల కోట్లు కేటాయించింది.
జీడీపీలో ద్రవ్యలోటు 5.9 శాతం ఉండే అవకాశం ఉంది అని కేంద్రం అంచనా వేసింది. 2025-26 నాటికి ద్రవ్యలోటు 4.5 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక బహిరంగ విపణి నుంచి రూ. 15.43 లక్షల కోట్ల అప్పులు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగించారు. వడ్డీ లేని రుణాల పథకం కోసం రూ. 13.7 లక్షల కోట్లు కేటాయించారు. కీలకమైన వంద మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ. 75 వేల కోట్లు కేటాయించారు. బడ్జెట్‌లో మూలధన వ్యయం మొత్తం రూ. 10 లక్షల కోట్లుగా ఉంది.
ప్రస్తుత ఏడాదికి భారతదేశం 7 శాతం వృద్ధి నమోదు చేస్తుంది అని ఆర్థిక సర్వే అంచనా వేసింది. దేశం వృద్ధి రేటు శరవేగంగా పెరుగుతోంది అని తెలిపింది.
81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చేయూతనివ్వనున్నట్లు ప్రకటించింది.
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపళ్యంలో కర్ణాటకపై కేంద్రం అధిక ప్రేమను కురిపించింది. కర్ణాటకలోని కరువుపీడిత ప్రాంతంలో సూక్ష్మ సేద్యం కల్పించడానికి రూ.5,300 కోట్లు కేటాయించింది.
అర్బన్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ ఫండ్ కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.10,000 కోట్లు ఖర్చు చేయనుంది
అంతరిక్ష శాఖకు రూ.12,544 కోట్లు కేటాయించారు.
పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై)ను మరో సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలిపారు. చెప్పారు. అంటే వచ్చే ఏడాది పాటు ప్రజలకు ఉచిత రేషన్ అందుతుంది.
ధరలు పెరిగేవి..
ధరలు తగ్గేవి..