ఆదాయపు పన్నుకు సంబంధించిన నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తోంది. అంటే ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త పన్ను విధానం అమలులోకి రానుంది. మరి ఈ కొత్త పన్ను విధానం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరుతుంది? ఎవరికి పన్ను కట్టాల్సిన పని లేదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
నిన్న మొన్నటి దాకా ఆకాశాన్నింటిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇది కొనుగోలుదారులకు శుభపరిణామంగా ఉన్నా రాబోవు రోజుల్లో వీటి ధరలు ఎలా ఉండబోతాయన్నది అంతుపట్టడం లేదు. అందులోనూ.. బడ్జెట్ అప్పుడు పెరుగుతుందన్న బంగారం ధర రోజులు గడిచేకొద్దీ తగ్గుముఖం పడుతోంది. ఇది దేనికి సంకేతమో వివరణ ఇచ్చేదే ఈ కథనం..
మీరు సంపాదించే ఆదాయంపై మీరు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అందుకు మీ ఆదాయాన్ని బట్టి ప్రభుత్వం కొన్ని శ్లాబులను ఏర్పాటుచేసింది. దానిని బట్టి మీ ఆదాయానికి తగిన శ్లాబును ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు కొన్ని పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. పొదుపు, పెట్టుబడులు, ఖర్చులు ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఆదాయపు పన్నుని లెక్కించి, మీ శ్లాబును నిర్ణయిస్తారు. అయితే చాలా మందికి ఈ లెక్కింపు విధానం అనేది అంత సులువు […]
సామాన్యుడి దగ్గరి నుంచి మల్టీ బిలియనీర్ వరకు దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది. బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెన్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి గాను 45.03 లక్షల కోట్ల రూపాయలతో ఈ బడ్జెను తయారుచేసింది. ఈ సంవత్సరం దాదాపు 9 రాష్ట్రాల్లో శాసన సభ ఎన్నికలు ఉండటంతో కేంద్రం ఎంతో జాగ్రత్తగా ఈ బడ్జెన్ రూపొందించింది. అమృత్ కాల్ బడ్జెట్‌గా దీనికి నామ […]
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్ లో 2023-24 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లో అందరి దృష్టిని ఆకర్షింపజేసిన అంశం ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పులు చేయడం. అయితే దాని తర్వాత అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే.. వ్యాపారస్థులకు సంబంధించి కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని చూస్తున్న వారికి ఇది శుభవార్త […]
కేంద్ర ప్రభుత్వం 2023-2024 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023-24 సంవత్సరానికి గాను 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. అమృత్ కాల్ బడ్జెట్ పేరిట రానున్న పాతికేళ్లలో దేశాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని సప్తర్షి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. సమ్మిళితాభివృద్ధి, ప్రతి ఒక్కరికి పథకాల ఫలాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, సామర్థ్యాల వెలికితీత, హరిత […]
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున మోడీ సర్కారుకు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కోవడంతో రాష్రాలన్నీ చాలా ఆశతో ఎదురుచూశాయి. అయితే, ఆ ఆశలు కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ఆనందాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ 2023లో ఆశించిన కేటాయింపులు దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని విజ్ఞప్తులు చేసినా, మంత్రులు ఎన్ని లేఖలు రాసినా ఎలాంటి […]
‘బడ్జెట్‘ దీని గురుంచి వార్తలు రాసేవారికి, వ్యాపారస్తులకు తప్ప మిగిలిన ప్రజానీకానికి అనవసరం. ప్రయోజనాలు ఉన్నా అర్థం కాని పరిభాషలో ఉంటుంది కనుక అనవసరం అన్నట్లుగా భావిస్తారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కోటి ఆశలతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ‘కేంద్ర బడ్జెట్ 2023-24‘ను ప్రవేశపెట్టారు. ఇందులో వేతన జీవులకు వరాలు(ఏడు లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు), మహిళల కోసం ప్రత్యేక పథకం(మహిళా సమ్మాన్ పొదుపు పథకం), పాన్ కార్డుకు జాతీయ కార్డుగా గుర్తింపు, […]
2023-24 ఆర్థిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రవేశపెట్టారు. మహిళలకు పలు పథకాలు ప్రకటించిన ఆమె.. పిఎం వికాస్ (ప్రధాన మంత్రి విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్) యోజన అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. శతాబ్దాల తరబడి తమ చేతి వృత్తులు, సంప్రదాయ వృత్తుల ద్వారానే జీవనం సాగించే వారిని విశ్వకర్మలుగా భావిస్తారు. కళలు, హస్త కళాలను సహకరించేందుకు ఈ పథకాన్ని తీసుకువస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వేలాది మంది హస్త […]
2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా మహిళల సంక్షేమం కోసం ‘మహిళా సమ్మాన్ బచత్ పత్ర‘ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇది వన్ టైమ్ చిన్న మొత్తాల పొదుపు పథకం. ఇది రెండేళ్ళ కాలానికి అంటే.. 2025 వరకు అందుబాటులో ఉంటుంది. దీనిపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే, ఇందులో ఉన్న మరో ముఖ్యమైన వెసులుబాటు ఏంటంటే.. పాక్షికంగా సొమ్మును ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. […]