మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారా? చేతిలో డబ్బులు లేవా? ఏం చేయాలో తెలియడం లేదా? అయితే.. మీకోసమే ఈ వార్త. మీరు బ్యాంక్‌కు వెళ్లి బిజినెస్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. చాలా బ్యాంకులు ఈ తరహా రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇందుకు దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా మినహాయింపేమీ కాదు. అర్హత కలిగిన వారికి పలు రకాల బిజినెస్ లోన్స్ అందిస్తోంది.. ఎస్‌బీఐ. వీటిల్లో స్టాండప్ ఇండియా లోన్ కూడా ఒకటి.
2016లో ప్రధాని మోదీ ఈ స్టాండప్ మిత్రా పథకాన్ని ప్రారంభించారు. ఇందులో ఎస్సీ లేదా ఎస్టీ, పరిశ్రమలు స్థాపించాలనుకునే మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాల్ని మంజూరు చేస్తుంది. ప్రత్యేకంగా మ్యానిఫ్యాక్చరింగ్, సర్వీస్,అగ్రి కల్చర్ సంబంధిత వ్యాపారలకు రుణాలిస్తుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు.. సాధికారతే లక్ష్యంగా ఈ రుణాలు అందిస్తున్నారు.
ఎలాంటి తనఖా లేకుండానే ఈ తరహా రుణాలు పొందొచ్చు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ స్టాండప్ ఇండియా స్కీమ్ కింద ఈ రుణాలు కవర్ అవుతాయి. తీసుకున్న రుణాన్ని 7 ఏళ్లలోపుగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మారటోరియం పీరియడ్ 18 నెలలు పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు రుణ మొత్తంలో 0.2 శాతంగా ఉంటుంది. జీఎస్‌టీ అదనం.
అప్లై చేసే విధానం
సంబంధిత https://www.standupmitra.in/Home/SUISchemes వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాలి. దీంతో కేంద్రం అర్హత ఆధారంగా వారికి బ్యాంక్ ఇంట్రస్ట్ రేట్లకే రుణాల్ని మంజూరు చేస్తుంది.
‘Stand Up India’ Scheme has resulted in a massive boost in terms of job creation, thus leading to the socio-economic empowerment of SCs, STs and women. #6YearsOfStandUpIndia pic.twitter.com/eXLmnGCPdC
— NSitharamanOffice (@nsitharamanoffc) April 5, 2022