అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. మరి దేశీయంగా గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉంది?
మొన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపునకు తాత్కాలికంగా బ్రేక్ వేయడంతో డాలర్ పుంజుకుంది. దీంతో బంగారం ధర పెరిగింది. 1933 డాలర్ల వద్ద ఉన్న గోల్డ్ ఏకంగా 24 డాలర్లు పెరిగి 1958 డాలర్లకు చేరుకుంది. అయితే మళ్ళీ బంగారం పతనమయ్యింది. నిన్న ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1957 డాలర్లు ఉండగా ఇవాళ 1956 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో బంగారం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ ఉదయం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 55,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 60,110 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఈ ధరలు తగ్గే అవకాశం ఉంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ వెండి ఔన్సు వద్ద 24 డాలర్ల వద్ద కొనసాగుతోంది. కానీ దేశీయంగా మాత్రం గతంలో లేని విధంగా భారీగా పతనమైంది. ఏకంగా కిలో దగ్గర ఒకే రోజులో రూ. 5300 తగ్గింది. నిన్న కిలో వెండి రూ. 5300 తగ్గడంతో ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో రూ. 73,500 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరే ఇవాళ కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల ప్రభావం కారణంగా ఈ వెండి ధర తగ్గే అవకాశం కనబడుతోంది. అయితే ఇప్పుడు వెండి కొనుగోలు చేసిన వారికి భారీగా లాభం పొందే అవకాశం ఉంది. ఎందుకంటే గత నెలలో కిలో వెండి రూ. 83,700 పలికింది. ఇప్పుడు రూ. 73,500 పలుకుతోంది. రూ. 10,200 వ్యత్యాసం ఉంది. ఇప్పుడు తగ్గిన వెండి ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ రూ. 83 వేల మార్కుకి చేరుకుంటుంది. రూ. 84 వేలు, రూ. 85 వేలు రేంజ్ కి వెళ్తుంది. జనవరి నెలలో రూ. 73,500 ఉన్న వెండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ.. ఒక్కసారిగా రూ. 83,700 మార్కుని చేరుకుంది.
అంటే జనవరి నెలలో కొన్నవారికి మే నెలలో ఒక కిలో వద్ద రూ. 10 వేల లాభం వచ్చినట్టు. అదే 5 కిలోలు కొన్నవారికి రూ. 50 వేలు, పది కిలోలు కొన్న వారికి రూ. లక్ష రూపాయలు లాభం వచ్చినట్టు. 5 నెలల్లో ఇంత మొత్తంలో లాభం రావడం అంటే గొప్ప విషయమే. అలానే ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుంది. ఇక ఇప్పుడు బంగారం కొనుగోలు చేసిన వారికి కూడా మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 60 వేల మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. గత నెలలో గరిష్టంగా రూ. 62,400 పలికింది. ఇప్పుడు రూ. 60,110 వద్ద కొనసాగుతోంది. ఇప్పుడు రూ. 60,110 వద్ద కొనుగోలు చేస్తే కనుక బంగారం మళ్ళీ రూ. 62 వేల మార్కుని చేరుకుంటుంది. అప్పుడు 10 గ్రాముల బంగారం వద్ద రూ. 2 వేలు పైనే మిగులుతుంది. ఒక 10 తులాల బంగారం కొన్నవారికి రూ. 22 వేల లాభం ఉంటుంది.
గమనిక: బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు అనేవి ఉంటాయి. కాబట్టి కొనే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాల్సిందిగా మనవి.