నిన్న అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గిన నేపథ్యంలో దేశీయంగా ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ సానుకూలంగా సాగుతుంది. మొన్న అనగా శనివారం గ్లోబల్ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ 1925.89 డాలర్ల వద్ద కొనసాగగా నిన్న, ఇవాళ కూడా అదే ధర కొనసాగింది. శని, ఆదివారాలు మార్కెట్ మూసి ఉన్న కారణంగా బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పు లేదు. ప్రస్తుతం అయితే అంతర్జాతీయ మార్కెట్లోనూ, దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మొన్న తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,150 వద్ద ఉండగా నిన్న రూ. 400 పెరిగింది. దీంతో నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 54,550 పలికింది. ఇక ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా ఉండడంతో ఇదే ధర కొనసాగుతోంది.
ప్రస్తుతం హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పట్టణాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 54,550 వద్ద కొనసాగుతుంది. ఇక 24 క్యారెట్ల బంగారం మొన్న రూ. 59,070 ఉండగా నిన్న రూ. 440 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం నిన్న రూ. 59,510 వద్ద పలికింది. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 59,510 వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా ఇలానే కొనసాగుతోంది. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ వెండి 23.15 డాలర్ల వద్ద కొనసాగగా.. నిన్న ఇదే ధర వద్ద కొనసాగింది. ప్రస్తుతం మాత్రం స్వల్పంగా పెరిగింది. ఇవాళ ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ వెండి 23.09 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
దేశీయంగా వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. నిన్న హైదరాబాద్ మార్కెట్లో రూ. 1000 పెరుగుదలతో కిలో వెండి రూ. 76,700కి చేరుకోగా ఇవాళ కూడా ఇదే ధర కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ. 76,700 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేని కారణంగా ఇవాళ స్థిరంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు గ్లోబల్ మార్కెట్లో సానుకూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పెరిగే అవకాశం ఉండచ్చు. కాబట్టి బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం.