బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే తగిన సమయం. గత రెండు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ఇవాళ దిగొచ్చింది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. గత రెండు రోజులుగా విపరీతంగా పెరిగిన బంగారం ధర ఇవాళ దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయింది. గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. యూఎస్ డాలర్ రేటు బలహీనంగా ఉండడం, యూఎస్ డేటా బలహీనపడడం, ఆర్థిక అనిశ్చితి, యూఎస్ ఫెడ్ ఇంట్రస్ట్ రేటు గరిష్టంగా ఉండడం, చమురు ధరలు పెరగడం వంటి కారణాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. డాలర్ రేటు పతనమైన కారణంగా ధరలు పెరిగాయి. అయితే తాజాగా డాలర్ పడిపోయిన కారణంగా రూపాయి పుంజుకుంది. ప్రస్తుతం డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 81.84 గా వద్ద కొనసాగుతోంది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఉదయం 08.40 గంటలకు ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 2007 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి ధర రూ. 24.97 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటి మీద పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం తగ్గింది. అంతర్జాతీయంగా బంగారం పడిపోవడంతో దేశీయంగా కూడా బంగారం దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,900 వద్ద కొనసాగుతోంది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 56,250 ఉండగా.. ఇవాళ రూ. 350 తగ్గింది. వంద గ్రాముల వద్ద ఏకంగా రూ. 3500 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 100 గ్రాములకు రూ. 5,59,000 కి పడిపోయింది. 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,590 గా ఉంది. నిన్న 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ. 5,625 గా ఉంది. గ్రాము వద్ద రూ. 35 తగ్గింది.
అలానే 24 క్యారెట్ల బంగారం కూడా తగ్గింది. గ్రాము వద్ద రూ. 38 తగ్గింది. 10 గ్రాముల వద్ద రూ. 380 తగ్గగా.. వంద గ్రాములకు రూ. 3,800 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60,980 ఉంది. నిన్న ఇదే బంగారం ధర రూ. 61,360 గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 6,136 గా ఉంది. ఇవాళ గ్రాము బంగారం మాత్రం రూ. 6,098 గా ఉంది. ఇక వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 700 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది. నిన్న కిలో వెండి ధర రూ. 80,700 ఉంటే.. ఇవాళ రూ. 700 తగ్గింది. నిన్న ఏకంగా రూ. 2900 పెరిగి రికార్డు క్రియేట్ చేసిన వెండి ధర ఇవాళ 4 రెట్లు తగ్గింది. ప్రతికూల పరిస్థితుల ప్రభావం, మార్కెట్ హెచ్చుతగ్గులు ఉంటాయని.. బంగారం, వెండి ధరల్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయని అంటున్నారు.