పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వారి ఆశలను ఆడియాశలు చేస్తూ వీటి ధరలు పెరిగాయి. ఆల్ టైమ్ రికార్డు స్థాయికి గోల్డ్, సిల్వర్ రేట్స్ చేరుకున్నాయి. అయితే తాజాగా వీటి ధరలు పతనమయ్యాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..?
కొన్ని రోజుల నుండి బంగారం ధర బెంబెలెత్తిస్తోంది. 2023 ప్రారంభం నుండే పసిడి ధర పెరుగుతూ వస్తోంది. కేంద్ర బడ్జెట్ తర్వాత తగ్గినట్లు కనిపించినప్పటికీ.. మళ్లీ బంగారం ధర పైపైకి ఎగబాకింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. ఏప్రిల్ మాసం మొదలైన నాటి నుండే గోల్డ్, సిల్వర్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. తులం బంగారం ధర రూ. 61 వేలకు పెరిగింది. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ నేపథ్యంలో బంగారం, వెండి వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వారి ఆశలపై ఒక్కసారిగా నీళ్లు జల్లింది. మధ్య తరగతి కుటుంబాలకు బంగారం కొనుగోలు పెను భారమైంది. అయితే తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు పతనం అయ్యాయి.
కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించాయి. అటు పెళ్లిళ్లు, అక్షయ తృతీయ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ పెరిగింది. కాగా, ఆదివారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌లో బంగారం, వెండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.760 తగ్గి, రూ. 61,190కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.700 తగ్గింది. ప్రస్తుతం రూ.56 వేల 100 మార్క్ వద్ద ట్రేడవుతోంది. వెండి ధర రూ.1100 మేర పడిపోయింది. ప్రస్తుతం కిలో సిల్వర్ రేటు రూ.78,500 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో గోల్డ్ రేటు కాస్త తక్కువగా సిల్వర్ రేటు కాస్త ఎక్కువగా ఉంటాయి.
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ.760 తగ్గింది. తులం గోల్డ్ ధర రూ. 61,400లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.700 మేర తగ్గింది. ప్రస్తుతం రూ.55,950 వద్ద నమోదవుతుంది. వెండి రేటు కూడా భారీగా కుప్పకూలింది. కిలో వెండి రేటు హైదరాబాద్‌లో రూ.1500 తగ్గింది. ప్రస్తుతం రూ.81, 500 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే హైదరాబాద్‌లో వీటి ధరలు కాస్త తక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ల చూసుకుంటే బంగారం ధర దిగివచ్చింది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2004 డాలర్ల మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు చూసుకుంటే ప్రస్తుతం 25.38 డాలర్ల వద్ద ఉంది. ఇక భారత దేశ కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూ.81.925 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.