పెళ్లిళ్లు, వేడుకల సమయం ఇది. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇది మీ కోసమే. బంగారం, వెండి ధరలు ఎప్పుడు స్థిరత్వంగా ఉండవు అన్న సంగతి తెలిసిందే. రెండు రోజులు ధరలు తగ్గి మురిపిస్తుంటే.. మళ్లీ వారం రోజులు పెరిగి నిరాశకు గురి చేస్తుంటాయి. అయితే ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఆడవాళ్లు అలంకార ప్రియులు. అందుకే అందానికి తగ్గట్టు ఆభరణాలపై ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా బంగారం వస్తువులంటే పట్టలేనంత ఇష్టం. ఎంత బంగారం ఉన్నా తనువు తీరదు మహిళలకు. ఏదైనా చిన్న వస్తువు బంగారం రూపంలో తీసుకోవాలని తాపత్రయ పడుతుంటారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లు వచ్చాయంటే.. ఏ చీరకు ఏ నగ వేసుకోవాలని వారం ముందు నుండి ప్రణాళికలను రచించుకుంటారు. ఏ వస్తువు కొన్నా దాని వాల్యూ తగ్గిపోతుంది కానీ, పసిడి,వెండి కొంటే మాత్రం పెరుగుతుందీ తప్ప తరగదు అన్న అవగాహనతో మగవాళ్లు సైతం దీని వైపు మొగ్గు చూపుతున్నారు. స్వామి కార్యం, స్వకార్యం తీరినట్లు చందంగా అటు భార్యలను మెప్పిస్తూ.. తమ ఆర్థిక అవసరాల కోసం ఉపయోగపడతాయన్న ముందస్తు ఆలోచనలతో బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అందుకే పుత్తడి, వెండి ధరలపై ఓ లుక్ వేస్తుంటారు.
పెళ్లిళ్లు, వేడుకల సమయం ఇది. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే ఇది మీ కోసమే. బంగారం, వెండి ధరలు ఎప్పుడు స్థిరత్వంగా ఉండవు అన్న సంగతి తెలిసిందే. రెండు రోజులు ధరలు తగ్గి మురిపిస్తుంటే.. మళ్లీ వారం రోజులు పెరిగి నిరాశకు గురి చేస్తుంటాయి. ఈ నెల మొదలైన తర్వాత బంగారం ధర రెండు రోజుల పాటు తగ్గినట్లు కనిపించినా,ఆ తర్వాత క్రమ క్రమంగా పెరుగుతూ వస్తోంది. రెండు రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1300 పైకి ఎగబాకింది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచిన నేపథ్యంలో గోల్డ్ రేట్ల పెరుగుదలకు ఊతమిచ్చింది.అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు ఒక్కరోజులో భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఏకంగా 2050 డాలర్ల మార్కును తాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 26 డాలర్ల మార్కు పైకి చేరింది. ఇదే సమయంలో డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.81.758 వద్ద కొనసాగుతోంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..? ఢిల్లీలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 పెరిగి రూ. 62,330గా నమోదైంది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ.57,150 వద్దకు చేరింది. కిలో వెండి రేటు రూ.300 పెరిగి రూ.77,100 మార్కు వద్ద ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 540 పెరిగి .. 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,180కు చేరువైంది. 22 క్యారెట్లకు రూ.500 ఎగబాకి రూ.57 వేల మార్కును చేరింది. వెండి ధర చూస్తే హైదరాబాద్‌లో మాత్రం ఒక్కరోజే రూ.1000 పెరిగి కిలోకు ప్రస్తుతం రూ.82,800 వద్ద నమోదైంది. ఇక బంగారం, వెండి రేట్లు అనేవి ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంటాయి.