మనలో ప్రతి ఒక్కరికీ సొంతంగా బిజినెస్ చేయాలనే ఆసక్తి ఉంటుంది. అయితే.. కొంత మంది ఆ దిశగా నడుస్తూ.. నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించి ఆకర్షణీయ రాబడి పొందుతూ ఉంటారు. మరికొందరు మాత్రం వెనకడుగు వేస్తూ.. చూద్దాంలే అన్నట్లుగా కాలం వెళ్లదీస్తుంటారు. అలాంటి వారికి ఒక విన్నపం.. పోయిన కాలం, గడిచిన సమయం తితిగిరావనే విషయాన్నే గమనించాలి. అయితే.. అందుకు వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఏ బిజినెస్ చేయాలో తెలియకపోవడం, కుటుంబం, ఆర్థిక అంశాలు ఇలా పలు కారణాల వల్ల బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వలేకపోతూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం తక్కువ పెట్టుబడితోనే అందుబాటులో ఉన్న ఒక బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. అదే ఎల్ఈడీ బల్బుల తయారీ బిజినెస్. పకడ్బందీ మార్కెటింగ్ చేసుకోగలిగితే ఈ వ్యాపారంలో అద్బుతమైన ప్రగతి సాధించవచ్చు.
సాంప్రదాయ ఇంధన వినియోగం తగ్గింపు చర్యల్లో భాగంగా తక్కువ కరెంటుతో నడిచే ఎల్ఈడీ బల్బులను ప్రపంచ దేశాలన్నీ ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలోనూ ఎల్‌ఈడీ బల్బులకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ బల్బులు వచ్చిన తర్వాత వెలుతురు బాగా పెరగడంతో పాటు కరెంటు బిల్లులు కూడా అదుపులోకి వచ్చాయి. అలాగే ఎల్ఈడీ బల్బులను ప్లాస్టిక్‌తో తయారు చేయడం వల్ల వీటి మన్నిక కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. అదే గ్లాస్ బల్బులు అయితే సులభంగా పగిలిపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో అందరూ ఈ బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Inspirational Story: ఎందరికో ఆదర్శం ఈ చంద్రకాంత్.. అంగవైకల్యాన్ని జయించి.. లక్షల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు!
ఈ బిజినెస్ ప్రారంభించడానికి పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్ కలిగి ఉండాల్సిన పని లేదు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది. రూ. 50 వేలతో కూడా బిజినెస్ ప్రారంభించొచ్చు. అలాగే కావాల్సిన స్థలం లేకపోతే ఇంట్లో కూడా వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. సాధారణంగా ఒక ఎల్ఈడీ బల్బు తయారీకి రూ.40 నుంచి రూ.50 వరకు ఖర్చు అవుతుంది. అయితే మీరు మార్కెట్‌లో ఈ బల్బులను రూ.80 నుంచి రూ.100 రేటుతో విక్రయించొచ్చు. కొన్ని చోట్ల ధర ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు. ఈ లెక్కన మీరు రోజుకు 50 ఎల్ఈడీ బల్బులు విక్రయించినా రోజుకు రూ. 2 వేల నుంచి రూ.2500 వందల వరకు ఆదాయం పొందొచ్చు. రోజుకు 50 బల్బులు అమ్మడం పెద్ద విషయం కాకపోవచ్చు.
గవర్నమెంట్ ఆమోదం పొందిన ఇన్‌స్టిట్యూషన్లు ఎల్‌ఈడీ బల్బులను ఎలా తయారు చేయాలో శిక్షణ ఇస్తూ ఉంటారు. అందువల్ల మీరు ఈ వ్యాపారం ప్రారంభించాలని భావిస్తే ముందుగా ట్రైనింగ్ తీసుకోవడం ఉత్తమం. శిక్షణా సమయంలో ప్రాక్టికల్, థియరీ సమాచారం పొందొచ్చు. బల్బు ఫిట్టింగ్, టెస్టింగ్, మెటీరియల్ కొనుగోలు, మార్కెటింగ్ మెళకువలు వంటి అన్ని విషయాలు సంక్షిప్తంగా తెలుసుకోవడం ఉత్తమం. మరి ఈ బిజినెస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.