Soil Health Card Scheme: గ్రామంలో నివసించే నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి ఉపాది అవకాశాన్ని కల్పిస్తోంది. ఓ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఇంటి దగ్గరే ఉంటూ మీరు నెలకు రూ.25వేలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ పథకం పేరు ‘సాయిల్ హెల్త్ కార్డు పథకం’. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 18 నుండి 40 సంవత్సరాల వయస్సున్న వారికి ఆర్థిక సాయం చేస్తుంది. మనం ప్రారంభించే వ్యాపారానికి 75 శాతం డబ్బును పెట్టుబడిగా అందిస్తుంది. ఈ పథకం ద్వారా మీ గ్రామ పంచాయతీలో ఓ చిన్న భూసార పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే అగ్రికల్చర్ క్లినిక్, అగ్రి ఎంటర్‌ప్రెన్యూర్ ట్రైనింగ్‌తో 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ పథకాన్ని పొందగలరు.
అంతేకాదు! రైతు కుటుంబానికి చెందిన వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. మినీ సాయిల్ టెస్టింగ్ లేబొరేటరీని ఏర్పాటు చేయడానికి, మీరు మీ జిల్లాలోని డిప్యూటీ డైరెక్టర్ (వ్యవసాయం) లేదా జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ వారి కార్యాలయాన్ని సంప్రదించాలి. పంచాయతీలో ఏదైనా చిన్న భూసార పరీక్ష ల్యాబొరేటరీ ఏర్పాటు చేయాలంటే దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కానీ సాయిల్ హెల్త్ కార్డ్ పథకం కింద.. ల్యాబ్ ఇన్‌స్టాలర్‌కు ప్రభుత్వం 75 శాతం చెల్లిస్తుంది.
మీ పంచాయతీలో ల్యాబ్ ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వం 3.75 లక్షల రూపాయలు ఇస్తుంది. మిగితా ఖర్చు. రూ.1.25 లక్షలు మనమే పెట్టుకోవాలి. ల్యాబరేటరీ కోసం సొంతంగా కానీ, అద్దెకు తీసుకున్న రూం కానీ, ఉండాలి. గ్రామీణ యువత కోరుకుంటే మొబైల్ సాయిల్ టెస్టింగ్ వ్యాన్ రూపంలో ప్రయోగశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. రైతుల పొలాల్లో మట్టి నమూనాలు తీసుకుని పరీక్ష చేయటం ద్వారా ఒక్కో పరీక్ష నమూనాకు రూ.300 వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇలా ప్రతీ నెలలో 15-25 వేల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. మరి, ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: Harsh Goenka: మోడీలపై హర్షా గోయెంకా ఫన్నీ ట్వీట్! ఆ మోడీకి మిస్ ఇండియా కావాలంటూ..