రైతన్నల్లారా పీఎం కిసాన్ డబ్బులకు సంబంధించి ముఖ్య అలెర్ట్ అందుతోంది గమనించగలరు. కేంద్రం చెప్పిన ఇన్స్ట్రుక్షన్స్ ఫాలో అయి రూ.2,000 మీ ఖాతాలో వేసుకోండి. లేనియెడల నష్టపోవాల్సి ఉంటుంది.
రైతన్నలకు ముఖ్య గమనిక. పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు పొందాలంటే ‘ఈ-కేవైసీ’ తప్పనిసరి అంటూ నివేదికలు వస్తున్నాయి. రైతన్నలు అందుకు అనుగుణంగా ఈ-కేవైసీ చేసుకోగలరని మనవి. లేనియెడల కేంద్రప్రభుత్వం అందిస్తోన్న రూ.2,000 ఆర్థికసాయాన్ని నష్టపోవాల్సి ఉంటుంది. ఈ-కేవైసీ అంటే ఏంటి..? ఎలా చేసుకోవాలి..? పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు ఎప్పుడు జమవుతాయి..? వంటి పూర్తి సమాచారం మీకోసం..
అన్నదాతలను ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలన్న ఉద్దేశ్యంతో 2019లో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో ఏడాదిలో మూడు దఫాలుగా రూ.6వేలు పెట్టుబడి సాయంగా జమ చేస్తుంటుంది. ఒక్కో విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు చొప్పున జమ అవుతాయి. ఇప్పటివరకు కేంద్రం ఈ పథకం కింద 13 విడతలుగా నిధులను విడుదల చేసింది. అంటే దాదాపు రూ. 26 వేలు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. 14వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ ఆర్థిక సాయం పొందాలంటే ఈ-కేవైసీ తప్పనిసరి అంటున్నారు.. వ్యవసాయ శాఖ అధికారులు.
“తదుపరి ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులు ఖాతాలో జమ కావాలంటే తప్పనిసరిగా ఆధార్ లింక్ చేయాలి..” అని వ్యవసాయ శాఖకు చెందిన ఓ నోడల్ అధికారి పేర్కొన్నారు. కాగా, పీఎం కిసాన్ యోజన 14వ విడత నగదు జమ గురించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, వస్తున్న నివేదికల ప్రకారం ఈ నెలాఖరున లేదా వచ్చే నెల రెండో వారంలో రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలను జమ చేసే అవకాశమున్నట్లు సమాచారం.
ఆన్‌లైన్‌లో..
ఆఫ్‌లైన్‌లో..
పీఎం కిసాన్ ఈ-కేవైసీ ప్రక్రియను బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో కూడా పూర్తి చేయవచ్చు. రైతులు తమకు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ వద్దకు వెళ్లి, బయోమెట్రిక్ ద్వారా పూర్తి చేయవచ్చు.
మీకు పీఎం కిసాన్ పథకం గురుంచి.. నిధుల గురుంచి ఏమైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్ pmkisan ict@gov.in మెయిల్ ద్వారా సంప్రదించ వచ్చు. లేదా ఈ క్రింది ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు.