బ్యాంకులు అంటే అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. కచ్చితంగా బ్యాంకుల్లో తమ కష్టార్జితానికి రక్షణ ఉంటుందనే భరోసాని ఇస్తున్నారు. కానీ, కొన్ని బ్యాంకులు చేస్తున్న పనులతో కస్టమర్స్ లో భయాందోళన మొదలైంది. ఎందుకంటే నిబంధనలు పాటించని బ్యాంకులపై ఆర్బీఐ చర్యలకు ఉపక్రమిస్తోంది.
సాధారణంగా ఎవరైనా తాము కష్టపడిన సొమ్ము దాచుకోవాలి అంటే వారికి ముందుగా గుర్తొచ్చేది బ్యాంకులు. ఎందుకంటే అక్కడ అయితే వారి సొమ్ముకు భద్రత, వారికి భరోసా ఉంటుంది కాబట్టి. కానీ, తాజా ఘటనలు చూస్తుంటే.. ఆ బ్యాంకుల విషంలోనే కస్టమర్స్ భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే రూల్స్ పాటించాల్సిన బ్యాంకులే నిబంధనలను ఉల్లఘించడం ఖాతాదారులు భయపడేలా చేస్తోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు బ్యాంకులపై చర్యలు తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించారంటూ రెండు బ్యాంకులకు జరిమానా కూడా విధించింది. ఈ చర్యలు ఇప్పుడు పెద్దఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి.
సాధారణంగా బ్యాంకులు ఆర్బీఐ చెప్పిన విధంగా నడుచుకోవాలి. ఏ ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకు అయినా కూడా ఆర్బీఐ రూల్స్ కి లోబడే తమ కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం తమకు నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నట్లు ఆర్బీఐ గుర్తించింది. అలా నిబంధనలు ఉల్లంఘించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్న బ్యాంకులకు మానిటరీ పెనాల్టీ విధించిన విషయాన్ని ఆర్బీఐ ప్రకటించింది. అలిఘడ్ సహకార బ్యాంక్, ఢిల్లీ నాగరిక్ సహకార బ్యాంకులకు ఆర్బీఐ ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1950 ఉల్లంఘన, డిపాజిట్లపై వడ్డీ రేట్లకు సంబంధించి విషయంలో కూడా ఈ రెండు బ్యాంకులు నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఈ జరిమానా విధించినట్లు తెలిపారు.
కస్టమర్లకు సంబంధించిన లావాదేవీలు, ఒప్పందాలు వంటి విషయాల నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించినట్లు వెల్లడించారు. అలిఘడ్ జిల్లా సహకార బ్యాంకుకు రూ.2 లక్షలు, ఢిల్లీ నాగరిక్ సహకార బ్యాంకునకు రూ.3 లక్షలు మానిటరీ పెనాల్టీని విధించిన విషయాన్ని రెండు వేర్వేరు ప్రకటనల్లో ఆర్బీఐ తెలిపింది. అయితే మూడ్రోజుల క్రితమే కరూర్ వైశ్య బ్యాంకునకు రూ.30 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని గుర్తించడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పుడు కూడా ప్రకటించారు. అయితే వరుసపెట్టి ఇలా బ్యాంకుల డొల్లతనం బయట పడటం, బ్యాంకులే నిబంధనలు పాటించకపోవడంపై కస్టమర్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.