ఇంధన ధరలు ప్రియం కావడంతో అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు ద్రుష్టి సారిస్తున్నారు. అందుబాటు ధరలో ఉండి, మంచి మైలేజ్ ఇచ్చే బైక్‌లు, కార్లవైపు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లకు పోటీగా ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అమెరికా కంపెనీ తయారుచేసిన ఓ సైకిల్ మాత్రం అందరిని ఆకట్టుకుంటోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈ సైకిల్ ధర అక్షరాలా.. రూ. 15 లక్షలు.
ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎలక్ట్రిక్ సైకిళ్ల రేంజ్ తక్కువగా ఉంది. తక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉండడం తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. కానీ, అమెరికన్ కంపెనీ ఆప్ట్ బైక్ తయారుచేసిన ‘ఆర్22 ఎవరెస్ట్‘ ఈ సైకిల్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 km ప్రయాణించగలదు. రేంజ్ విషయంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఎలక్ట్రిక్ కార్లను కూడా అధిగమించే సత్తా దీనికి ఉంది.
‘R22 ఎవరెస్ట్’ అనేది మౌంటెయిన్ బైక్. 3,260 Wh లిథియం-అయాన్ బ్యాటరీ ఇందులో అమర్చారు. దీని బరువు సుమారు 16 కిలోలు. అవసరం లేని సమయంలో బ్యాటరీని సైకిల్ నుంచి తొలగించవచ్చు కూడా. ఈ సైకిల్‌లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది గరిష్టంగా 58 kmph వేగంతో ప్రయాణించగలదు. కఠినమైన భూభాగాల్లోనూ వెళ్లేలా దీన్ని డిజైన్ చేశారు. కార్బన్-ఫైబర్ ఫ్రేమ్ , స్వింగ్ ఆర్మ్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్‌తో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో డిస్క్ బ్రేకులు కూడా అమర్చారు. బ్యాక్ లైట్ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో బ్యాటరీ పర్సెంటేజ్, స్పీడ్, ట్రిప్ ఓడోమీటర్, లైఫ్ టైమ్ ఓడోమీటర్ వంటి సమాచారాన్ని చూడవచ్చు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర US$ 18,900. అంటే మన కరెన్సీలో సుమారు ₹ 15 లక్షలు.
6x the capacity of a common low-cost electric bicycle in the US.
Of course the $18,900 R22 Everest also costs around 27x the price of that $799 low cost e-bike
Optibike’s proprietary 1,700 watt PowerStorm mid-drive motor with a crushing 190Nm of torquehttps://t.co/79PCz23pBM
— Circame3 (@circame3) July 28, 2022
ఇదీ చదవండి: Mahindra Atom Electric Car: దేశంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్!
ఇదీ చదవండి: Electric Car: ఈ కారులో 30 రూపాయలతో 300 కిలోమీటర్లు! తెలుగు కుర్రొడి ఘనత..