బ్యాంకులు తమ వినియోగాదారులను ఆకట్టుకునేందుకు నిత్యం కొత్త కొత్త పథకాలు, ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలానే కొత్త స్కీమ్ లతో తమ ఖాతాదారుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నం చేస్తుంటాయి. అలానే ఆయా బ్యాంకులు.. వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ రేట్ల విషయంలో మార్పులు చేస్తుంటాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి ఫిక్స్ డిపాజిట్ల విషయంలో బ్యాంకులు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ ఖాతాదారులకు ఆయ బ్యాంకులు శుభవార్తలు చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB) ఫిక్స్ డ్ డిపాడిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వారం వ్యవధిలోనే రేట్లను సవరించడం ఇది రెండో సారి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అతి ముఖ్యమైన వాటిల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి. ఇది ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. గరిష్టంగా 0.75 శాతం వరకు రేట్లను పెంచుతూ సదరు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. రూ.2 కోట్ల వరకు ఉన్న ఎఫ్ డీలపై ఈ రేట్లను పీఎన్ బీ సవరించింది. వారం వ్యవధిలో రేట్లను సవరించడం ఇది రెండో సారి. మొత్తానికి ఇటీవల 50 బేస్ పాయిట్స్ ఉన్న వడ్డీ రేట్లను 75 బేస్ పాయిట్స్ కి పీఎన్ బీ పెంచింది. ఈ సవరించిన రేట్లు అక్టోబర్ 26 నుంటి అమల్లోకి వచ్చాయి. పీఎన్ బీ బ్యాంక్ అధికారిక వెబసైట్ ప్రకారం… 7 రోజుల నుంచి 10 ఏళ్లు కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 6.10 శాతం మధ్య వడ్డీ రేట్లు ఇస్తుంది. 600 రోజుల మెచ్యూర్ కాలపరిమితి ఉన్న సాధారణ కస్టమర్ల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం పెంచింది.
46-90 రోజుల మెచ్యూర్ డిపాజిట్లపై 3.75 శాతం నుంచి 4.50 శాతం కి పెంచింది. అలానే 180 రోజుల నుంచి ఏడాది లోపు కాలపరిమితి ఉన్న మెచ్యూర్ డిపాజిట్లపై 5 శాతం నుంచి 5.50 శాతంకి పెంచింది. అలా పలు రకాల మెచ్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు 75బేస్ పాయింట్స్ పెంచించింది. ఈ కొత్తరేట్లు అక్టోబర్ 26 నుంచి అమలులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ లో చూడండి. అలానే హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు సైతం ఎఫ్ డీ లపై రేట్లను నెల వ్యవధిలో రెండు సార్లు పెంచింది. వివిధ రకాల కాలమితులు కలిగిన రూ.2 కోట్ల వరకు చేసిన ఫిక్స్ డిపాజిట్లపై 50 బేస్ పాయింట్స్ వరకు పెంచింది. రికరింగ్ డిపాజిట్ల రేట్లను కూడా పెంచింది.